నా భర్తతోనే అక్రమ సంబంధం పెట్టుకుంటావా?!

Published on Sat, 07/18/2026 - 08:14

కృష్ణాజిల్లా: కట్టుకున్న భర్త మరో మహిళతో ఉంటూ తనని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడన్న కోపంతో భార్య తన కుటుంబ సభ్యులతో ఆ మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన మచిలీపట్నంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బలరామునిపేటకు చెందిన శ్రీను అనే వ్యక్తికి అంజలితో వివాహం అయ్యింది. శ్రీను శ్లాబు పనులు చేస్తుంటాడు. అయితే ఐదేళ్ల క్రితం శ్రీను మీనాక్షి అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. 

కొంతకాలంగా ఆమెతోనే ఉంటూ మొదటి భార్యను పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అంజలి శుక్రవారం రాత్రి తన బంధువులతో కలిసి మీనాక్షిని నడిరోడ్డుపై అడ్డుకుని విచక్షణారహితంగా దాడి చేసింది. ఆమెతో పాటు బంధువులు మీనాక్షిని మహిళ అని కూడా చూడకుండా మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నడిరోడ్డుపై ఆమె దుస్తులను చింపేసి తీవ్రంగా అవమానించారు. కొంత మంది మగాళ్లు కూడా మహిళ అని చూడకుండా మీనాక్షి జుట్టు పట్టుకుని ఈడ్చేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. 

స్థానికులు పలువురు చికిత్స నిమిత్తం ఆమెను మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో వైద్యుల సలహా మేరకు పోలీసులు తమ ప్రయత్నాన్ని ఉపసంహరించుకున్నారు. బాధితురాలు కోలుకున్న అనంతరం వివరాలు సేకరించి ఆమె ఇచ్చిన ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చిలకలపూడి పోలీసులు తెలిపారు. 

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)