Breaking News

ప్రేమజంట హడావుడి.. గుడిలోకి వెళ్లి తలుపులు మూసివేసి..

Published on Tue, 05/02/2023 - 08:47

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): ఆమె సచివాలయంలో అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌. అతను అదే సచివాలయ పరిధిలో వలంటీర్‌.  ఉద్యోగరీత్యా వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పెద్దలకు తెలిస్తే పెళ్లికి ఒప్పుకోరనే భయంతో గ్రామంలోని గుడిలో పెళ్లి చేసుకుని అనంతరం గుడి తలుపులు మూసేసి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ హడావుడి సృష్టించారు. సంచలనం కలిగించిన ఈ సంఘటన బందరు మండలం బుద్దాలపాలెం గ్రామంలో సోమవారం జరిగింది. 

వివరాలు ఇలా ఉన్నాయి. బుద్దాలపాలెంకు చెందిన కొక్కు నాగరాజు అదే గ్రామంలో వలంటీర్‌గా పని చేస్తున్నాడు. మచిలీపట్నంకు చెందిన గాయత్రి రెండేళ్ల కిందట సచివాలయ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి ఎంపికైంది. ఆమెకు బుద్దాలపాలెం సచివాలయంలో పోస్టింగ్‌ ఇచ్చారు. విధి నిర్వహణలో భాగంగా నాగరాజు గాయత్రిల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. అయితే ఇరువురికీ వేర్వేరు కులాలు. 

దీంతో తమ పెళ్లికి  పెద్దలు అంగీకరించరనే భయంతో సోమవారం వారు గ్రామంలోని రామాలయంలోకి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. అనంతరం తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలంటూ గుడి లోపలే ఉండి తలుపులు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న రూరల్‌ సీఐ రవికుమార్, ఎస్‌ఐ చాణక్య గ్రామ పెద్దల సహకారంతో ఇద్దరినీ బయటికి తీసుకువచ్చి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇరువురి తరపు బంధువులు స్టేషన్‌కు వచ్చేందుకు నిరాకరించారు. ప్రేమికులు ఇరువురూ మేజర్‌లు కావటంతో పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి గ్రామ పెద్దల సమక్షంలో వారిని పంపించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)