Breaking News

బైక్‌ను ఢీకొని మినీ లారీ దగ్ధం

Published on Mon, 10/27/2025 - 04:42

రామభద్రపురం: కర్నూలు సమీపంలో ఇటీవల జరిగిన వేమూరి కావేరి బస్సు ప్రమాదం తరహాలోనే విజయనగరం జిల్లా రామభద్రపురం వద్ద బైపాస్‌ రోడ్డులో శనివారం అర్ధరాత్రి ఓ బైక్‌ను ఢీకొని మినీ లారీ పూర్తిగా కాలిపోయింది. రామభద్రపురం ఎస్‌ఐ వి.ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం... పాచిపెంట మండలం గడివలస గ్రామానికి చెందిన బెవర అప్పలనాయుడు శనివారం అర్ధరాత్రి 11.45 గంటల సమయంలో మద్యం మత్తులో బైక్‌పై రామభద్రపురం మీదుగా బాడంగి మండలం రౌతువానివలసలోని తన అత్తవారి ఇంటికి వెళుతున్నాడు.

ఒడిశాకు చెందిన మినీ లారీ తుని నుంచి గోనె సంచుల లోడుతో రామభద్రపురం బైపాస్‌ రోడ్డు మీదుగా ఒడిశా వెళుతోంది. మార్గం మధ్యలో  పొట్టవాని కోనేరు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో రోడ్డు పక్కన పడిపోయిన అప్పలనాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. మినీ లారీ కింద ఇరుక్కుపోయిన బైక్‌ను సుమారు వంద అడుగుల వరకు ఈడ్చుకెళ్లింది. తీవ్ర రాపిడితో బైక్‌ పెట్రోల్‌ ట్యాంకు పగిలి మంటలు చెలరేగాయి. బైక్, మినీ లారీ కాలిపోయాయి. బాడంగి అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)