Breaking News

లోకేశ్‌ పాదయాత్ర వెలవెల

Published on Fri, 09/08/2023 - 05:03

నరసాపురం రూరల్‌/పాలకొల్లు అర్బన్‌: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో నారా లోకేశ్‌ గురువారం నిర్వహించిన పాదయాత్రకు జనస్పందన కరువైంది. నరసాపురం నియోజకవర్గంలో జనం లేక పాదయాత్ర వెలవెలబోయింది. దీంతో స్థానిక టీడీపీ నేతలపై లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. పాలకొల్లు మండలం దిగమర్రు నుంచి పెదమామిడిపల్లి వరకు నిర్వహించిన పాదయాత్రకు జన స్పందన కరువైంది.

దిగమర్రు మూడు రోడ్ల కూడలిలో ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మహిళలతో ఖాళీ బిందెలు ప్రదర్శించి మంచినీటి సమస్య ఉన్నట్టుగా బిల్డప్‌ ఇచ్చారు. దిగమర్రు గ్రామంలో కల్లుగీత కార్మికులతో మాట్లాడారు. పెదమామిడిపల్లి చేరుకునేసరికి చీకటి పడింది. దీంతో టీడీపీ కార్యకర్తలు కాగడాలు వెలిగించి ఆగస్టులో కూడా విద్యుత్‌ కోతలంటూ దుష్ప్రచారం చేశారు. కార్యకర్తలకు పెట్రోల్‌ కోసం రూ.100, మగవారికి రూ.500, ఆడవారికి రూ.300 చెల్లించి పాదయాత్రకు తరలించినట్టు సమాచారం. పాదయాత్రలో జై బాలయ్య, జై జై నిమ్మల అనే నినాదాలే వినిపించాయి. ఎక్కడా లోకేశ్‌కు అనుకూల నినాదాలు చేయకపోవడం గమనార్హం. 

లోకేశ్‌ టీమ్‌ నిర్లక్ష్యంతో దంపతులకు గాయాలు
యువగళం బృందం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పాదయాత్ర సందర్భంగా ఓ దంపతులు గాయాల పాలయ్యారు. నరసాపురం మండలం చిట్టవరం వద్ద లోకేశ్‌ టీమ్‌కు చెందిన కారు డోరు ఒక్కసారిగా తెరవడంతో నరసాపురం వైపు వస్తున్న మోటార్‌ బైక్‌కు బలంగా తగిలింది. బైక్‌పై ప్రయాణిస్తున్న కడలి మోహనరావు, సరోజిని దంపతులు కిందపడిపోయి గాయాలపాలయ్యారు. పోలీసులు వెంటనే వారిద్దరినీ వాహనంలో తీసుకెళ్లి పాలకొల్లులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)