Breaking News

విచ్చలవిడి బెల్టు షాపులు.. ఏపీలో ఏరులై పారుతున్న మద్యం

Published on Tue, 12/31/2024 - 13:56

సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. బెల్టు షాపుల ద్వారా ప్రభుత్వం భారీగా తాగించడంతో.. అక్టోబర్ 16 నుంచి నిన్నటి వరకు 6312 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 26,78, 547 కేసుల బీర్లు, 83,74, 116 కేసులు మద్యం అమ్మకాలు సాగాయి. న్యూ ఇయర్‌కి రూ. 1000 కోట్లు మద్యం వ్యాపారులు టార్గెట్ పెట్టుకోవడంతో గత ఏడాది డిసెంబర్ కంటే భారీగామద్యం అమ్మకాలు పెరిగాయి.

విచ్చలవిడి బెల్టు షాపులతో మందుబాబులు భారీగా మద్యం తాగేస్తున్నారు. 2023 డిసెంబర్‌లో 25,83,530 కేసుల మద్యం.. 6,4,370 కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది  డిసెంబర్‌లో 30,46,362 కేసుల లిక్కర్.. 9,11,815 కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి. డిసెంబర్‌లో 4,62,832 కేసుల లిక్కర్.. 2,87,438 కేసుల బీర్ల అమ్మకాలు పెరిగాయి. 18 శాతం లిక్కర్, 40 శాతం బీర్ల అమ్మకాలు పెరిగాయి.

ఇదీ చదవండి: చిత్తూరులో ఇద్దరు ఎమ్మార్వోల వీరంగం.. రియల్టర్‌పై దాడి

దుకాణాలతో పాటు వాటి వద్ద అనధికార పర్మిట్‌ రూమ్‌లు, బెల్ట్‌ షాపులు పెరగడంతో మద్యం వినియోగం అధికమైంది. దీనికి తగ్గట్టుగా నూతన సంవత్సర వేడుకల్లో మద్యం అమ్మకాలు అంచనాలకు మించి ఉంటాయని వ్యాపారులు నమ్మకంతో ఉన్నారు. ఇందుకు తగినట్టుగానే డిపోలకు అక్కడ నుంచి మద్యం దుకాణాలకు మద్యం రావాణా జోరుగా సాగుతోంది. కోనసీమ జిల్లా అమలాపురం మద్యం డిపోకు పెద్ద ఎత్తున మద్యం లోడులు చేరుకున్నాయి.

ఇక్కడ బైపాస్‌ రోడ్డులోని మద్యం డిపో వద్దకు ఒకేసారి 15 నుంచి 20 వరకు మద్యం లారీలు రావడం, వెంటనే దుకాణాలకు తరలించేందుకు చిన్న చిన్న వ్యాన్లు రోడ్డు మీదనే ఉంచడంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయిందంటే, నూతన సంవత్సర వేడుకల్లో మద్యం అమ్మకాలపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయనేది తేటతెల్లమవుతోంది.

 

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)