Breaking News

తిరుమల: బోనులో చిక్కిన చిరుత

Published on Sat, 06/24/2023 - 07:13

సాక్షి, తిరుపతి: తిరుమలలో బోనులో చిరుత పులి చిక్కింది. మొన్న అలిపిరి మార్గంలో మూడేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుతే ఇది. 7వ మైలురాయి వద్ద ఇది బోనులో పడింది. కేవలం ఒక్కరోజులోనే చిరుతను బంధించారు అధికారులు.

నిన్న సాయంత్రం చిరుతను బంధించేందుకు రెండు బోన్లను ఏర్పాటు చేశారు అధికారులు. 150 ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిన్న రాత్రి(శుక్రవారం, జూన్‌ 23) 10.45 గంటల ప్రాంతంలో చిరుత బోనులో పడినట్లు తెలుస్తోంది.  

డీఎఫ్‌వో ఏమన్నారంటే..
బాలుడిపై దాడి చేసిన ఒక్కరోజులోనే చిరుతను బంధించాం. తల్లి, పిల్ల చిరుతలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ చిరుతను ఇంకా వేటాడడం పూర్తిగా అలవాటు కాలేదు అని డీఎఫ్‌వో తెలియజేశారు.


చిన్నారి కౌశిక్‌ను పరామర్శిస్తున్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. పక్కన చికిత్స అందిస్తున్న వైద్యుడు

తిరుమల నడక మార్గంలోని 7వ మైలు వద్ద ఓ చిరుత పులి బాలు​డిపై దాడి చేసింది. తన తాతతో కలిసి అక‍్కడే ఉన్న దుకాణంలో తినుబండారాలు కొనుక్కుంటున్న సమయంలో హఠాత్తుగా వచ్చిన చిరుత బాలు​డి మెడ పట్టుకుని ఎత్తుకెళ్లింది. వెంటనే స్పందించిన అక్కడి దుకాణదారుడు, తల్లిదండ్రులు, భద్రతా సిబ్బంది కేకలు పెడుతూ చిరుత వెనుక పరు­గులు తీశారు. టార్చ్‌లు వేస్తూ, రాళ్లు విసరడంతో 7వ మైలు కంట్రోల్‌ రూం వద్ద చిరుత బాలు​డిని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయింది. చిరుత దాడి నుంచి బాబును అక్కడి భద్రతా సిబ్బంది రక్షించారు.

గాయాల పాలైన బాలు​డిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు. బాలుడి చెవి వెనుక, మరికొన్ని ప్రాంతాల్లో చిరుత దంతపు గాయాలయ్యాయి.  అయితే ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గాయపడిన బాలు​డు కర్నూలు జిల్లా ఆదోని వాసి కౌషిక్‌(3)గా గుర్తించారు. దాడి గురించి తెలియగానే.. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి బాలు​డిని పరామర్శించారు. బాలు​డికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

చిరుత దాడి చేసిన మెట్ల మార్గంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటునట్టు తెలిపారు. ఇకపై నడక మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా పంపుతామన్నారు. భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి: గోవధ నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారు?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)