Breaking News

సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, ఎమ్మెల్యేపై ఫిర్యాదు

Published on Fri, 10/04/2024 - 05:35

అవనిగడ్డ: తిరుపతి వెంకటేశ్వరస్వామి లడ్డూ వ్యవ­హారంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లా­డిన సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, అవనిగడ్డ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ నేత మాధవీ­లతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కృష్ణాజిల్లా అవనిగడ్డలోని ఏడో వార్డుకు చెందిన న్యాయ విద్యార్థి బడే గౌతమ్‌ అవనిగడ్డ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమది హిందూ కుటుంబమని, తరచూ తిరుపతి వెళ్లి స్వామిని దర్శించుకుని లడ్డూ ప్రసాదాలు స్వీకరిస్తామని చెప్పారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు లడ్డూలో పందికొవ్వు కలిసిందని ఆరోపించడం తగదన్నారు. 

డిప్యూటీ సీఎం  పవన్‌ కళ్యాణ్‌ హిందువులను రెచ్చగొట్టేలా ప్రసంగించారని, హోంమంత్రి వంగలపూడి అనిత, తెలంగాణ బీజేపీ నేత మాధవీలత లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని మీడియో ముందు మాట్లాడారని, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ లడ్డూలో కల్తీ జరిగిందని దేవాలయాల్లో పూజలు చేయించారని చెప్పారు. 

హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడంతో పాటు చట్టవ్యతిరేక విధానాలు అవలంబించిన వీరందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు గౌతమ్‌ చెప్పారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)