Breaking News

గర్భిణి అని కూడా చూడకుండా..

Published on Thu, 07/23/2026 - 12:03

ఆంధ్రప్రదేశ్‌, అన్నమయ్య: పైళ్లెన పది నెలలకే అత్తింటి వేధింపులు భరించలేక నాలుగు నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తంబళ్లపల్లె మండలంలో చోటు చేసుకుంది. మృతురాలి తల్లి దండ్రులు తంబళ్లపల్లె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు... కోటకొండ పంచాయతీ, బీఎస్‌ఆర్‌ వడ్డిపల్లికి చెందిన మహేష్‌, రవళి (18)ని 10 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. పైళ్లెన మూడు నెలల నుంచే అత్త అరుణ వేధింపులు ప్రారంభించింది. దీంతో రవళి తీవ్ర మనోవేదనకు గురైంది.

గర్భిణి అని కూడా చూడకుండా..
రవళి ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి. అయినప్పటికీ అత్త అరుణ వేధింపులకు గురిచేసేది. వేధింపులు భరించలేక రవళి ఈనెల 15 ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించగా, డాక్టర్లు చికిత్సలు అందించి పరిస్థితి విషమించడంతో రుయాకు రెఫర్‌ చేశారు. అక్కడి నుంచి బెంగళూరుకు తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి మరింత విషమించడంతో మంగళవారం రాత్రి స్వగ్రామానికి తీసుకు వచ్చారు. బుధవారం ఉదయం నాలుగు నెలల గర్భిణి రవళి మృతి చెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తంబళ్లపల్లె ఎస్‌ఐ అనీల్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?