షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!
Breaking News
ఆగని భూ పందేరం
Published on Sun, 07/12/2026 - 05:21
సాక్షి, అమరావతి : ఉమ్మడి విశాఖ జిల్లాలోని విలువైన భూములను చంద్రబాబు సర్కారు కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతోంది. గడిచిన రెండేళ్లలో వందల ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్, బినామీ సంస్థలకు కట్టబెట్టిన సర్కారు.. తాజాగా పలు సంస్థలకు తక్కువ ధరకే భూములను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎకోబాక్స్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనే సంస్థ ఆనందపురం వద్ద ఏర్పాటు చేసే లాజిస్టిక్ పార్క్ కోసం 91.38 ఎకరాలను ఎకరా రూ.55 లక్షలు చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వీటికి వీఎంఆర్డీఏ, ఏపీఐఐసీ మౌలిక వసతులను కల్పించనున్నాయి. అక్షత్ గ్రీన్టెక్ లిమిటెడ్ అనకాపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న 3.5 గిగావాట్ల సోలార్ సెల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్కు పరవాడలో ఎకరం రూ.65 లక్షల చొప్పున చౌక ధరకు 34.02 ఎకరాలు కేటాయించింది. బెర్రీ అల్లాయిస్ ఏర్పాటు చేయనున్న మాంగనీస్ సింటర్ ప్లాంట్కు విజయనగరం బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఎకరం రూ.77.25 లక్షలు చొప్పున 93.43 ఎకరాలను కేటాయించింది.
కర్నూలులో దేవదాయ భూముల సేకరణ
కర్నూలు జిల్లా జొన్నగిరి వద్ద ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ కంపెనీ జీయో మైసూర్ కంపెనీకి 998.10 ఎకరాలను సేకరించి ఇవ్వడానికి ఏపీఐఐసీకి అనుమతిస్తూ ఉత్తుర్వులు జారీ చేసింది. ఇందులో 40.12 ఎకరాలుగా ఉన్న దేవదాయ భూములను లీజు విధానంలో సేకరించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది.
Tags : 1