బీసీలపై ఎందుకీ కక్ష.. ఇదేనా రెడ్‌బుక్ పాలన?

Published on Tue, 08/04/2026 - 14:46

నెల్లూరు: బీసీల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం వేధింపుల‌కు పాల్ప‌డుతోంద‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ ఆరోపించారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, దౌర్జ‌న్యాల‌ను ప్ర‌శ్నిస్తున్న బీసీ నాయ‌కుల‌పై అక్ర‌మ కేసులు బనాయిస్తోంద‌ని మండిప‌డ్డారు. రెడ్‌బుక్ పాలనపై ప్ర‌జ‌లు తిర‌బ‌డే రోజు వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. బీసీలే టార్గెట్.. ప్రశ్నిస్తే కేసులు, పోరాడితే అరెస్టులా? ఇదేనా రెడ్‌బుక్ పాలన? అంటూ ప్ర‌శ్నించారు.

''చంద్రబాబూ బీసీలంటే.. ఎందుకీ కక్ష? ఎమ్మెల్యే విరూపాక్షి, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, చింతాడ రవి, జోగి రమేష్ కుటుంబ సభ్యులపై నమోదైన కేసులు యాదృచ్ఛికం కావు. ప్రజల తరఫున బలంగా గొంతెత్తుతున్న బీసీ నాయకత్వాన్ని బలహీనపర్చడానికే జరుగుతున్న టార్గెట్ రాజకీయాలే. అధికారం ఉంది కదా అని వెనుకబడిన వర్గాలను వేధిస్తే వెన్నుపోటు పార్టీపై బీసీల తిరుగుబాటు తప్పదు.

బీసీ నాయకులను వేధించడం ఆపండి.. లేదంటే మీ బూడిద పార్టీని బీసీలు బూడిద చెయ్యడం ఖాయం.. ఖబడ్దార్. రెడ్‌బుక్ రాజకీయాలు శాశ్వతం కావు ప్రజాస్వామ్యమే శాశ్వతం. బీసీలపై కక్షసాధింపు పాలనకు ప్రజలే తగిన సమయంలో గట్టి సమాధానం చెబుతార''ని ఎక్స్ వేదిక‌గా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

చ‌ద‌వండి: కూట‌మి ప్ర‌భుత్వంపై బొలిశెట్టి ఫైర్‌

Videos

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)