Breaking News

విజయ డెయిరీపై ఎలాంటి విచారణకైనా సిద్ధమే! 

Published on Fri, 05/19/2023 - 04:36

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు విజయ డెయిరీలో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని కర్నూలు మిల్క్‌ యూనియన్‌(విజయ డెయిరీ) చైర్మన్‌ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. హెరిటేజ్‌ డెయిరీ వల్ల కో–ఆపరేటివ్‌లోని ఎన్ని డెయిరీలు మూతపడిపోయా­యి.. ఎంత మం­ది ఉద్యోగులు, కా ర్మికులు రోడ్డున పడ్డా­రో తెలుసు­కోవా­లని నారా లోకేశ్‌కు సూచించారు. ఎవరో రాసిచ్చి న స్క్రిప్ట్‌ చదవడం కాదని, నిజానిజాలు తెలుసుకోవాల­న్నా­రు. గురువారం కర్నూలులో ఆయన మీడియా­తో మాటా­­్లడా­రు. రెండేళ్లలోనే విజయ డెయిరీని రూ.33 కోట్ల నికర లాభాల్లోకి తెచ్చామన్నారు.

రూ.20 కోట్లతో అధునాతన యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చి నట్టు తెలిపా­రు. పాల ఉత్పత్తిదారులకు రూ.7.50 కోట్లు, కా ర్మికులకు రూ.1.50 కోట్ల బోనస్‌ పంపిణీ చేశామని వివరించారు. రూ.180 కోట్లు ఉన్న టర్నోవర్‌ను 2022–­23 నాటికి రూ.240 కోట్లకు పెంచామని, 2023–­24 సంవత్సరం పూర్తయ్యే నాటికి టర్నోవర్‌ను రూ.270 కోట్లకు తీసుకెళతామన్నారు.పాల ఉత్పత్తిదారులకు లీటరుకు రూ.3 ప్రకారం బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించామని, ఉద్యోగులు, కార్మికుల సంఖ్యను 550 నుంచి 750కి పెంచినట్టు తెలిపారు.

చంద్రబాబు హెరిటేజ్‌ డెయిరీ కారణంగా రాజమండ్రి, చిత్తూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, అనంతపురంలోని కో–ఆపరేటివ్‌ డెయిరీలు మూతపడ్డాయని, ఈ విషయాన్ని లోకేశ్‌ తెలుసుకోవాలని సూచించారు. భూమా కుటుంబం ఆ­ళ్ల­గడ్డలో జగత్‌ డెయిరీ ఏర్పాటు చేసిన సమయంలో విజయ డెయిరీకి పాలు సరఫరా చేస్తామనే ఒప్పందంతో రూ.1.50 కోట్లు తీసుకుని, పాలు సరఫరా చేయలేదని, ఆ డబ్బులు ఇప్పిస్తే సంతోషిస్తామని ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)