చంద్రబాబును గెలిపించడమే మా తప్పు.. కుప్పంలో రైతుల ఆగ్రహం

Published on Thu, 05/29/2025 - 09:31

సాక్షి, చిత్తూరు: చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కూటమి సర్కార్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఎయిర్‌పోర్టు కోసం ప్రభుత్వం బలవంతంగా భూసేకరణకు దిగింది. ఈ నేపథ్యంలో తమ భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. చంద్రబాబును గెలిపించినందుకు తమకు తగిన బుద్ధి చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

కుప్పంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు కోసం చంద్రబాబు ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేపట్టింది. రామకుప్పం, శాంతిపురం మండలాల్లో భూసేకరణ చేస్తోంది. శాంతిపురం మండలం దండికుప్పంలో బలవంతంగా భూసేకరణకు కూటమి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా రెవెన్యూ అధికారులు అక్కడ భూమిని పరిశీలించేందుకు వెళ్లారు. దీంతో, రెవెన్యూ అధికారులను రైతులు అడ్దుకున్నారు. ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.

ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబును గెలిపిస్తున్నందుకు మాకు తగిన బుద్ధి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అధికారులు మాత్రం.. ఎకరాకు 16 లక్షలు ఇస్తామని రైతులను బలవంతంగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. తమను ప్రశ్నిస్తే, కోర్టులకు వెళ్తే రూ.10లక్షలు మాత్రమే ఇస్తామని రెవెన్యూ అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని రైతులు చెబుతున్నారు.

కాగా, కుప్పంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు కోసం చంద్రబాబు ప్రభుత్వం 1405 ఎకరాలు భూ సేకరణ చేయాలని టార్గెట్‌ పెట్టుకుంది. ఈ క్రమంలోనే రైతుల వద్ద నుంచి బలవంతంగా భూసేకరణకు దిగింది. ఇప్పటికే 458 ఎకరాలు భూమి సేకరించింది. అదనపు భూమి కోసం రైతులను వేధింపులకు గురిచేస్తోంది.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)