Breaking News

కూటమి ప్రభుత్వంలో లా అండ్‌ ఆర్డర్‌ గతి తప్పింది: కొట్టు సత్యనారాయణ

Published on Thu, 02/20/2025 - 15:29

సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు కేఎస్ఎన్ కాలనీ వద్ద రూ. 22 కోట్ల 44 లక్షల రూపాయల నిధులతో 30 గ్రామాలకు రోడ్లు నిర్మాణానికి అప్పటి మంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే, నిన్న(బుధవారం) రాత్రి సమయంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు జేసీబీతో శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.

ధ్వంసం అయిన శిలాఫలకాన్ని మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ. పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా మాట్లాడుతూ.. శిలాఫలకాన్ని జేసీబీతో కూల్చడం హేయమైన చర్య అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ అదుపుతప్పి, అరాచక శక్తులు చెలరేగిపోతున్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? అంటూ  ప్రశ్నించారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగులను శిక్షించాలని.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కొట్టు సత్యనారాయణ అన్నారు.

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)