Breaking News

కింజరాపు వారి బంధుప్రీతి

Published on Sun, 08/10/2025 - 12:54

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా అన్నీ వచ్చి చేరుతాయనే సామెత అందరికీ తెలిసిందే. అయితే ఆ కేటాయింపులో సైతం పూర్తిగా బంధు ప్రీతి చూపిస్తూ మిగిలిన వారిని పక్కన పెట్టేయడం కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడుకే చెల్లుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న స్వాతంత్య్ర వేడుకలకు జిల్లాలో కోట»ొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ సర్పంచ్‌ కింజరాపు సురేష్‌ను ఎంపిక చేశారు. అయితే ఇందులో విషయం ఏముంది అనుకుంటున్నారా..? ఆయన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకు సొంత అన్న కుమారుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుకు సొంత బాబాయ్‌ కుమారుడు. 

జిల్లాలో ఎంతో మంది ఆదర్శవంతంగా సేవలు అందజేసిన సర్పంచ్‌లు ఉన్నప్పటికీ కేవలం బంధుప్రీతిని చూపించుకుంటూ సొంత కుటుంబ సభ్యుడిని స్వాతంత్య్ర వేడుకలకు ఎంపిక చేయడంపై సొంత పారీ్టకి చెందిన వారే విస్తుపోతున్నారు. అటు రాజకీయాల్లోనూ అవకాశం ఇవ్వకపోగా, కనీసం ఇలాంటి సామా జిక కార్యక్రమాల్లో సైతం ఇతరులకు అవకాశం ఇవ్వకపోవడంపై ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గత ఏడాది ఇదే మాదిరిగా ఢిల్లీలో ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు కేంద్రమంత్రికి వరుసకు మామ, రాష్ట్ర మంత్రికి వరుసకు మేనత్త కొడుకైన దోమ మోహన్‌రావు, ఆయన భార్య పుణ్యవతిని ఆదర్శ రైతులుగా ఎంపిక చేసి అప్పట్లో విమర్శలపాలయ్యారు. 

వేడుకల ఎంపిక సిఫార్సులో పూర్తిగా పక్షపాతం.. 
ఢిల్లీలో జరగనున్న స్వాతంత్య్ర వేడుకలకు గ్రామ స్థాయిలో సర్పంచ్‌ల ఎంపిక విషయంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు పూర్తిగా పక్షపాత వైఖరి చూపించా రు. వాస్తవంగా ప్రతి పంచాయతీలో అభివృద్ధికి సంబంధించి ఆయా సర్పంచ్‌లు చేసిన కృషి, నిధుల వినియోగంలో అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని వేడుకలకు సిఫార్సులు చేస్తారు. ఇక్కడ  పూర్తిగా విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి.

 జిల్లాలో తమకు అడ్డే లేదన్న మాదిరిగా మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి మరీ కింజరాపు కుటుంబం బంధు ప్రీతిని చూపించుకున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇదే సురేష్‌ పై పోటీకి సిద్ధమైన వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌తో పాటు కొంత మంది వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి చేసిన సంఘటనల్లో నిమ్మాడ సర్పంచ్‌ సురేష్‌ కీలకంగా వ్యవహరించారు. అలాంటి వ్యక్తికి అవార్డుకు ఎంపిక చేయడంపై విమర్శలు వస్తున్నాయి.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)