Breaking News

AP: రూ.100 కోసం హత్య

Published on Tue, 11/19/2024 - 05:09

కర్నూలు (టౌన్‌): ఇద్దరూ కల్లు తాగారు. బొమ్మ–బొరుసు ఆడారు. రూ.వంద పోగొట్టుకున్న వ్యక్తి.. గెల్చిన యువకుడి తలపై బండరాయితో కొట్టి చంపేశాడు. ఈ విషాద సంఘటన కర్నూలులో సోమవారం జరిగింది. స్థానిక మమతానగర్‌కు చెందిన కృపానందం అలియాస్‌ ఆనంద్‌ (27) వృత్తిరీత్యా గౌండా (తాపీ) పని చేస్తున్నాడు. తల్లి, నలుగురు సోదరులు ఉన్న అతడు రోజూ కల్లు తాగేవాడు.

స్థానిక రోజావీధికి చెందిన అజీజ్‌ అతడికి పరిచయమ­య్యాడు. సోమవారం ఇద్దరూ కల్లు తాగిన తర్వాత సంకల్‌బాగ్‌లోని ఓ స్కూల్‌ వద్ద బొమ్మ–బొరుసు ఆట ఆడారు. ఈ ఆటలో కృపానందం రూ.100 గెల్చున్నాడు. ఈ విషయంపై ఇద్దరు గొడవ పడ్డారు. తన డబ్బులు ఇచ్చేయాలంటూ అజీజ్‌ రాయితో కృపానందం తలపై కొట్టాడు. దీంతో కృపానందం అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)