Breaking News

ఎమ్మెల్యేకు మామూళ్లు సెట్‌ చేశాం

Published on Tue, 11/04/2025 - 04:20

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: లిక్కర్‌ సిండికేట్‌లో టీడీపీ నేతల ప్రమేయం మరోసారి బట్టబయలైంది..! తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లిక్కర్‌ సిండికేట్‌లో మామూళ్ల వసూళ్లకు సంబంధించి అధి­కార పార్టీకి చెందిన మరో నేత అడ్డంగా బుక్క­య్యారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రధాన అనుచరుడు కిలపర్తి శ్రీనివాస్‌ మాట్లాడిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్కో మద్యం షాప్‌నకు రూ.1.40 లక్షల చొప్పున వసూలు చేయాలంటూ షాప్‌ యజ­మానితో ఆయన మాట్లాడడం సంచలనంగా మారింది. అందులోని వివరాల ప్రకారం, ‘నేను (కిలపర్తి శ్రీనివాస్‌), మురళి, బాలు, రాంబాబు అందరం కూర్చుని మాట్లాడుకున్నాం.

ఎమ్మెల్యేకు (మామూళ్ల) అమౌంట్‌ సెట్‌ చేశాం. బాటిల్‌పై అదనంగా రూ.10కి అమ్ముకునే విషయం బాలు ఎమ్మెల్యేతో మాట్లాడి సెట్‌ చేస్తాడు. షాప్‌నకు రూ.1.40 లక్షలు వసూలు చేస్తున్నాం. చాలామంది ఇచ్చేశారు’. (‘బాగా పెరిగిందండీ..’ అని షాప్‌ ఓనర్‌ అన్నారు). డిపార్ట్‌మెంట్‌కు ఏం ఇవ్వాలి అన్నది లెక్కలు ఉంటాయి. రూ.100 స్టాంప్‌ పేపర్‌పై రాసుకుని, 20 మందితో మాట్లాడి ఎమ్మెల్యే దగ్గరపెట్టి చేద్దాం. మీరు మాత్రం రేపు 11 గంటలకు డబ్బు చేర్చుతారా..?’ అని పేర్కొన్నారు. కాగా, ఆ గొంతు తనది కాదని, ఏఐ ద్వారా సృష్టించారని కిలపర్తి శ్రీనివాస్‌ మాత్రం ప్రకటన విడుదల చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. 

ఇప్పటికే మజ్జి రాంబాబు ఆడియో వైరల్‌ 
కొద్ది రోజుల క్రితం ఓ మద్యం షాపు యజమా­నితో ఎక్సైజ్‌ శాఖకు ఎంత ఇవ్వాలి? మద్యం ధర ఎంత పెంచి అమ్మాలి? అనే విషయమై రాజమహే­ంద్రవరం టీడీపీ నేత మజ్జి రాంబాబు ఆడియో బహిర్గతమైంది. ఇది జరిగి నెలలు గడవకముందే ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి  ఆడియో బయటకు రావడం గమనార్హం. బండారం పదేపదే బయటపడుతున్నా ఏమాత్రం సిగ్గు లేకుండా మద్యం దందా కొనసాగిస్తున్నారని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు  వస్తున్నాయి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)