Breaking News

తాడిపత్రి చేరుకున్న పెద్దారెడ్డి.. ఎస్పీ సమక్షంలో భద్రత

Published on Sat, 09/06/2025 - 07:23

సాక్షి, అనంతపురం: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి చేరుకున్నారు. పోలీసు భద్రత మధ్య తాడిపత్రిలోని స్వగృహానికి వెళ్లారు పెద్దారెడ్డి. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలతో అనంతపురం ఎస్పీ జగదీష్ స్వయంగా రంగంలోకి దిగి భద్రత కల్పించారు. ఇక, కేతిరెడ్డి పెద్దారెడ్డి రాక సందర్భంగా 672 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పెద్దారెడ్డికి హారతి ఇచ్చి దిష్టి తీశారు కుటుంబ సభ్యులు. 

వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాదాపు 15 నెలల తర్వాత తాడిపత్రికి వెళ్లారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో తాడిపత్రిలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. అంతకుముందు.. తాడిపత్రి వెళ్లటంపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కేతిరెడ్డి మాట్లాడుతూ..‘15 మాసాల తర్వాత తాడిపత్రికి వెళ్లటం ఆనందంగా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు భద్రత కల్పించారు. పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తాను.  తాడిపత్రి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తాను. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తాను’ అని చెప్పుకొచ్చారు. 

ఇదిలా ఉండగా.. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ‘ఓ వ్యక్తిని తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారు..?’ అని పోలీసులను ఘాటుగా ప్రశ్నించింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఖర్చును భరించాలని పెద్దారెడ్డికి సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)