Breaking News

ఆలయం మళ్లీ తెరుస్తా.. పది కేసులు పెట్టుకోండి: పండా

Published on Mon, 11/03/2025 - 07:10

టెక్కలి: తొక్కిసలాట నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఆలయంతో పాటు ధర్మకర్త హరిముకుంద పండా ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆలయ ప్రధాన గేటు నుంచి తోటలో ధర్మకర్త ఇంటివరకు పోలీసులు మోహరించి పండాను బయటకు వెళ్లనీయకుండా ఆంక్షలు విధించారు.

ఆలయ సంప్రదాయం ప్రకారం పండా ప్రతిరోజూ ఆలయంలో దీపం పెట్టే ఆనవాయితీ ఉంది. పోలీసులు అడ్డుకోవడంతో ఆలయంలో ఆదివారం దీపం పెట్టే అవకాశం దక్కలేదు. పోలీసులు అతడి ఇంటిని అష్ట దిగ్బంధం చేయగా.. ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఘటనలో పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కనబడుతుంటే.. ఆలయ ధర్మకర్తపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదంటూ ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నాయకులు హెచ్చరించిన సంగతి తెలిసిందే.

10 కేసులు పెట్టుకోండి: పండా
‘దేవుడికి గుడి కట్టాను. అందరూ రావాలి. పూజలు చేయాలని కోరుకున్నాను. ఇలా జరిగితే నేనేం చేస్తాను.  కేసులు కడితే నా మీద ఒకటి కాదు 10 కేసులు పెట్టుకోండి’ అని ఆలయ ధర్మకర్త హరిముకుంద పండా సమాధానమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగి 9 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయాలు పాలవడంపై పండా కన్నీళ్లు పెట్టుకున్నారు. చెడ్డపని చేస్తే అనుమతి కావాలి తప్ప.. మంచి పనికి కాదన్నారు. ‘అమ్మ కోరికతో తాహతుకు మించి డబ్బులు పెట్టి గుడి కట్టాను. అంతా శ్రీనివాసుడే చూసుకుంటాడు. ఇక్కడ పోలీసులు ఎవరూ ఉండొద్దు. వారికి ఇక్కడ ఏం పని అందరూ వెళ్లిపోండి. నేను గుడి తలుపులు తీస్తాను’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.      
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)