Breaking News

తిరుమలలో నేటి నుంచి మూడ్రోజుల పాటు కారీరిష్టి యాగం

Published on Tue, 08/22/2023 - 07:56

తిరుమల : దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని, స‌కాలంలో వ‌ర్షాలు కుర‌వాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ ఆగ‌స్టు 22 నుండి 26వ తేదీ వ‌ర‌కు కారీరిష్టి యాగం, వరుణజపం, ప‌ర్జ‌న్య‌శాంతి హోమాల‌ను నిర్వ‌హించ‌నుంది తిరుమల తిరుపతి దేవస్థానం. 

దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు పడాలని, దేశమంతటా శాంతిని కాంక్షిస్తూ నేటి నుంచి తిరుమలలో కారీరిష్టి, వరుణ, పర్జన్య శాంతి యాగాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే యాగ క్రతువు ఆరు రోజుల పాటు కొనసాగి, 26వ తేదీన తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో జరిగే అవబృదేష్టితో ముగుస్తుంది.

తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్య‌క్ర‌మాలు నిర్వహించనుండగా 32 మంది వేద‌, శ్రౌత‌, స్మార్థ‌పండితులు యాగ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఆగ‌స్టు 26న మ‌హాపూర్ణాహుతి నిర్వహించనున్నారు. 

ఈ ఉత్సవాల్లో భాగంగా ధర్మగిరిలో మూడ్రోజులు వరుణజపం నిర్వహించనున్నారు అర్చకులు. ఈనెల 26న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేసి 27 నుంచి మూడ్రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. 

ఆన్‌లైన్‌లో టికెట్లు.. 
ఈ యాగాలు పూర్తయ్యాక వచ్చేనెల తితిదేలో సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వాటిని అనుసరిస్తూ అక్టోబర్ 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక నవంబర్ నెలలో జరగనున్న కార్యక్రమాలకు నేడే ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేయనున్నారు. ఉ.10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవా, సహస్ర దీపాలంకరణ టికెట్లు విడుదల చేయనున్నారు. 

ఇది కూడా చదవండి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)