Breaking News

తల్లిదండ్రులూ దూరం.. ప్రియుడి ఇంటి వద్ద ఏమైందో ఏమో?

Published on Sat, 06/13/2026 - 13:55

కాకినాడ క్రైం: ఏమైందో ఏమో.. ప్రియుడి ఇంటి వద్ద ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. కంపా లాఫీ (17) అనే బాలిక తల్లిదండ్రులు పీతా నాగదేవి, కంపా బంగారయ్యలు విడిపోయి కుమార్తెను స్థానిక తారకరామ నగర్‌లో పిన్ని జయవాణి వద్ద వదిలేసి వెళ్లిపోయారు.

మూడేళ్ల క్రితం నరసింహ రోడ్డుకు చెందిన తన వయసున్న బాలుడితో లాఫీకి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం పిన్ని, బాబాయ్‌లకు తెలియడంతో వారు మందలించారు. మనస్తాపం చెందిన బాలిక ప్రియుడి ఇంటికి వెళ్లిపోయింది. కొద్ది నెలలుగా అక్కడే ఉంటోంది.

ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఆ బాలుడితో పాటు అతని తల్లి లోవలక్ష్మి ఓ టైలరింగ్‌ షాప్‌లో, తండ్రి శివకుమార్‌రాజు దుస్తుల దుకాణంలో పనిచేస్తున్నాడు. వీరితో పాటే లాఫీ నివసిస్తోంది. గురువారం రాత్రి శివకుమార్‌రాజు ఇంటికి వచ్చి చూసేసరికి అప్పటికి కుమారుడు, భార్య ఇంటికి చేరలేదు. లాఫీ ఇంట్లో ఉండడంతో తలుపు కొట్టాడు. ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చి వంట గది కిటికీ లోంచి చూస్తే ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని లాఫీ వేలాడుతోంది.

కంగారు పడిన శివకుమార్‌రాజు స్థానికుల సాయంతో తలుపులు తెరిచి చూసేసరికి బాలిక అచేతనంగా ఉంది. ఆమెను జీజీహెచ్‌కు తరలించాడు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. లాఫీ మృతికి ఆ బాలుడితో పాటు అతడి తల్లిదండ్రులు, మరో వ్యక్తి కారణమని బాబాయ్‌, పిన్ని ఆరోపించారు. మృతురాలి బాబాయ్‌ నూకరాజు ఫిర్యాదుతో కాకినాడ వన్‌ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)