Breaking News

వివాహేతర సంబంధం కొనసాగించలేదని కాల్పులు

Published on Thu, 08/07/2025 - 13:30

కాకినాడ: శంఖవరం మండలం, పెదమల్లాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని శృంగధార గ్రామంలో ఈ నెల 3న మణికుమార్‌ (గబ్బర్‌సింగ్‌) అనే వ్యక్తి భార్యాభర్తలపై నాటు తుపాకీతో కాల్పులు జరపడానికి ప్రధాన కారణం వివాహేతర సంబంధం కొనసాగించలేదనే కక్షే కారణమని పోలీసు విచారణలో తేలింది. బుధవారం అన్నవరం పోలీస్‌ స్టేషన్‌లో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శృంగధార గ్రామానికి చెందిన కాకూరి చంద్రయ్య (చంద్రబాబు) భార్య సూర్యావతితో అదే గ్రామానికి చెందిన మణికుమార్‌కు వివాహేతర సంబంధం ఉంది. కొంత కాలం ఇద్దరూ కలిసే ఉన్నారు. అయితే ఇటీవల సూర్యావతి తన భర్త చంద్రయ్య వద్దకు వచ్చేసింది. తనను వదిలేసి వచ్చిందని సూర్యావతిపై మణికుమార్‌ కక్ష పెంచుకున్నాడు. 

ఈ నెల 3న అర్ధరాత్రి చంద్రయ్య, సూర్యావతి వారి ఇంటి అరుగుపై నిద్రపోతుండగా మణికుమార్‌ వారిపై నాటు తుపాకీతో కాల్పులు జరపగా, ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని డీఎస్పీ వివరించారు. మణికుమార్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం పెదమల్లాపురం వద్ద ప్రత్తిపాడు సీఐ సూర్యఅప్పారావు ఆధ్వర్యంలో అరెస్ట్‌ చేసి నాటు తుపాకీని స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడిని ప్రత్తిపాడు కోర్టుకు తరలించినట్టు డీఎస్పీ వివరించారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)