నకిలీ మద్యంపై సిట్‌ దర్యాప్తు హాస్యాస్పదం

Published on Mon, 10/13/2025 - 04:46

సాక్షి, అమరావతి: నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్రమంతటా యథేచ్ఛగా సరఫరా చేస్తున్న టీడీపీ నేతలు పూర్తి ఆధారాలతో పట్టుబడినా... ఇప్పటివరకు నోరు మెదపని సీఎం చంద్రబాబు హఠాత్తుగా ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌సీపీ నేతలు, మాజీ మంత్రులు కె.నారాయణస్వామి, కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు.

ఆదివారం మాజీ మంత్రులిద్దరూ సంయుక్త ప్రకటన చేస్తూ.. కేవలం నిజాలను సమాధి చేయడానికి, కేసును నీరుగార్చడం కోసమే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని వారు స్పష్టం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి చంద్రబాబు వేసిన ‘సిట్‌’లన్నీ కేవలం కక్షసాధింపు కోసం లేదా వాస్తవాలు బయటకు రాకుండా చేయడం కోసమేనని  వారు గుర్తు చేశారు. ఆ ప్రకటనలో నారాయణస్వామి, కాకాణి ఏమని పేర్కొన్నారంటే..  

పరిశ్రమల మాదిరిగా.. 
‘రాష్ట్రంలో ఇంత విచ్చలవిడిగా.. పరిశ్రమల్లా యంత్రాలు పెట్టి నకిలీ మద్యం తయారు చేస్తున్న టీడీపీ నేతలు దాన్ని రాష్ట్రమంతా సరఫరా చేస్తూ పక్కా ఆధారాలతో పట్టుబడ్డారు. నకిలీ మద్యానికి ఇప్పటికే పలువురు బలయ్యారు. అందుకే నకిలీ మద్యంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నాం. మరి దానికి సీఎం చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? నిజానికి ‘సిట్‌’ అనేది చంద్రబాబు జేబులోని సంస్థ. మేం డిమాండ్‌ చేస్తున్నట్టుగా సీబీఐ దర్యాప్తు కోరకుండా, సిట్‌ ఏర్పాటు చేయడమంటే.. తాము తప్పు చేశామని చంద్రబాబు అంగీకరించినట్లే కదా?రాష్ట్రంలో ఇప్పుడు నకిలీ మద్యం అనేది ఏదో ఒకచోట మాత్రమే బయటపడటం లేదు.

దాన్ని పక్కాగా వ్యవస్థీకృతంగా లిక్కర్‌ మాఫియా నడుపుతోంది. ఆ మాఫియాలో ఉన్న వారంతా టీడీపీ నాయకులే.  నిజానికి పెదబాబు, చినబాబు కనుసన్నల్లోనే నకిలీ మద్యం దందా కొనసాగుతోంది. తన హయాంలో అంత యథేచ్ఛగా నడుస్తున్న ఆ రాకెట్‌పై తానే సిట్‌ వేయడం హాస్యాస్పదం. నిజానికి ములకలచెరువు ఘటన తర్వాత రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క వైన్‌షాపుపై కూడా ఎక్సైజ్‌ అధికారులు దాడి చేయలేదు. పరి్మట్‌ రూమ్‌లు, బెల్టు షాప్‌లను కనీసం తనిఖీ చేయలేదు. అంటే ఏ స్థాయిలో ఈ నకిలీ మద్యం మాఫియా నడుపుతున్నారో స్పష్టమైంది. ఇంత జరిగినా ఇప్పుడు కూడా గత మా ప్రభుత్వంపైనే చంద్రబాబు బురద చల్లుతున్నారు. చంద్రబాబు ఇప్పుడు చెబుతున్న క్యూఆర్‌ కోడ్, స్కానింగ్‌ వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు అమలు చేశారు. అప్పుడు ప్రభుత్వమే వైన్‌షాపులు నడపడం వల్ల ఎక్కడా అక్రమాలకు తావు లేకుండా పోయింది. 

కానీ, చంద్రబాబు సీఎం అయ్యాక గత ప్రభుత్వ మద్యం విధానాలన్నింటినీ రద్దు చేసి మద్యం షాపులన్నిటినీ ప్రైవేటుపరం చేశారు. వాటన్నింటినీ తన మాఫియా ముఠా చేతుల్లో పెట్టారు. తమ పార్టీ వారికే మద్యం షాపులు కట్టబెట్టి, వాటికి పర్మిట్‌ రూమ్‌ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. చివరకు బెల్టు షాపులను కూడా మద్యం మాఫియా చేతుల్లో పెట్టారు. అంటే నకిలీ మద్యం వాళ్లే తయారు చేస్తారు. వాళ్ల మద్యం షాపులు, బెల్టుషాపులకు తరలించి అమ్మేస్తారు. ఇదే స్పష్టంగా జరుగుతోంది. ఇప్పుడు ఈ నకిలీ మద్యం దందా ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో ప్రజల ముందు దోషిగా నిలబడిన సీఎం చంద్రబాబు కేసు డైవర్షన్‌ కోసం ఈ సిట్‌ డ్రామాకు తెరలేపారు.

ఈ దందాలో ఆయనకు ఏ మాత్రం ప్రమేయం లేకపోతే.. కేసుపై కొంతైనా చిత్తశుద్ధి ఉంటే మా పార్టీ డిమాండ్‌ చేస్తున్నట్టు నకిలీ మద్యంపై సిట్‌తో కాకుండా సీబీఐతో దర్యాప్తు చేయించాలి. అలా తన నిర్దోషిత్వాన్ని, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని వైన్‌షాపుల్లో వెంటనే తనిఖీలు చేయాలి. ఏది అసలు మద్యమో.. ఏది నకిలీదో, కల్తీదో తేల్చాలి. ఈ వ్యవహారం వెనుక ఉన్న టీడీపీ నేతలను అరెస్ట్‌ చేయాలి. ఎక్సైజ్‌ శాఖ మంత్రిని బర్తరఫ్‌ చేయాలి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. జయచంద్రారెడ్డితో ఒప్పందం కుదుర్చుకుని నకిలీ మద్యం దందా నడిపించిన కిలారు రాజేష్‌ ద్వారా ముడుపులు అందుకున్న లోకేశ్‌పైనా సీబీఐ విచారణకు ఆదేశించాలి. అప్పుడే ప్రజలకు చంద్రబాబుపై నమ్మకం ఏర్పడుతుంది’ అని మాజీ మంత్రులు కె.నారాయణస్వామి, కాకాణి గోవర్థన్‌రెడ్డి తేల్చి చెప్పారు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)