Breaking News

తిరుపతి తొక్కిసలాటపై జ్యుడిషియల్‌ విచారణకు ఆదేశించాం

Published on Thu, 01/30/2025 - 05:39

సాక్షి, అమరావతి : తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురి మృతి, 40 మందికి పైగా గాయపడిన ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తితో జ్యుడిషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశా­మని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్‌కు స్పష్టం చేశామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌­జీపీ) సింగమనేని ప్రణతి హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు.

తొక్కిసలాటపై సిట్టింగ్‌ లేదా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని, 30 రోజుల్లో నివేదికను గవర్నర్‌కు సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కర్నూలు జిల్లాకు చెందిన రైతు గుదిబండ ప్రభాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. విచారణ కమిషన్‌ నివేదికను గర్నవర్‌కు సమర్పించకపోతే ఆ నివేదికను ప్రభుత్వం బుట్టదాఖలు చేస్తుందని చెప్పారు. 

కమిషన్‌ గడువును ప్రభుత్వం నిరవధికంగా పొడిగించే అవకాశం కూడా ఉందని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వం జ్యుడిషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ వ్యాజ్యం నిరర్థకమవుతుందని తెలిపింది. తాను కమిషన్‌ ఏర్పాటును మాత్రమే అడగటంలేదని, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఏం చేయాలో 30 రోజుల్లో శాస్త్రీయ ఆడిట్‌ చేసేలా ఆదేశాలివ్వాలని కూడా కోరానని శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ వ్యాజ్యంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)