Breaking News

తాడిపత్రిలో ‘కాక’ రేపిన జేసీ

Published on Tue, 10/14/2025 - 08:54

తాడిపత్రి టౌన్‌: జేసీ కుటుంబం తమ ఆధిపత్యం కోసం ప్రత్యర్థి పార్టీల నాయకులనే కాకుండా సొంత పార్టీ నాయకులపై సైతం కక్షపూరితంగా వ్యవహరిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశ   మైంది. తాజాగా సోమవారం తాడిపత్రిలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీకే చెందిన కాకర్ల బ్రదర్స్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రకటించి సొంత పార్టీ నాయకులే విస్తుపోయేలా చేశారు. సీఎం సామాజికవర్గానికి చెందిన కాకర్ల రంగనాథ్, జయుడు, రంగనాయకులు గ్రూపు, కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, అందుకే వారిని సస్పెండ్‌ చేస్తున్నట్లు తీర్మానించడం గమనార్హం. 

గత కొన్ని రోజులుగా తాడిపత్రిలో జేసీ, కాకర్ల బ్రదర్స్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. వినాయక చవితి వేడుకల్లో ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకొని రణరంగం సృష్టించారు. సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన సందర్భంగా ఇరువర్గాలు ఒకరిని మించి మరొకరు బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. కాకర్ల బ్రదర్స్‌ స్టిక్కర్‌ కనిపిస్తే వాహనాలను ధ్వంసం చేస్తామని అప్పట్లో టీడీపీ నాయకులు సోషల్‌ మీడియా వేదికగా పేర్కొనడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలోనే కాకర్లను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని టీడీపీ జిల్లా, రాష్ట్ర నాయకుల ముందు జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రతిపాదన ఉంచినట్లు సమాచారం. 

అయితే వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో జేసీ తనకు తానుగా కాకర్లను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించి మరోసారి చర్చకు తెరతీశారు. కాగా, కాకర్ల  రంగనాథ్‌ సీఎం చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు మంత్రి నారా లోకేష్‌తో సన్నిహిత సంబంధాలు కల్గి ఉన్న నేపథ్యంలో తాడిపత్రి టీడీపీలో మున్ముందు ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కాకర్ల రంగనాథ్

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)