Breaking News

దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దాడి

Published on Sun, 09/22/2024 - 05:42

సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమరావతి: ఏరా లం...కొడకా.. చంపేస్తాను నా కొడకా.. ఏంటి రా నన్ను తిట్టావంట.. చదువుకునే కుర్రాళ్లను రెచ్చగొ­డతావా.. అంటూ నోటికొచ్చినట్టు బండ బూతులు తిడుతూ ఓ దళిత ప్రభుత్వ వైద్యుడిపై కాకినాడ రూరల్‌ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తన అనుచరులతో కలసి పిడిగుద్దులతో దాడి చేశారు. శనివారం కాకినాడ రంగరాయ వైద్య కళాశాల (ఆర్‌ఎంసీ) మైదానంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించి పూర్వా­పరాలిలా ఉన్నాయి. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలకు శ్రీనగర్‌లో 12 ఎకరాల క్రీడా మైదానం ఉంది.

ఇందులో సుమారు 150 గజాల్లో మెడికోల కోసం వాలీబాల్‌ కోర్ట్‌æ ఉంది. వైద్య కళాశాల ముందస్తు అనుమతి లేకుండా ఇతరులు క్రీడల కోసం ఆ కోర్టును వినియోగించరాదు. అయితే గత కొంత కాలంగా కాకినాడ సిటీ, రూరల్‌ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ అను­చరులమంటూ సుమారు 40 మంది యువకులు వాలీబాల్‌ కోర్ట్‌కు వస్తూ మెడికోలపై గొడవకు దిగుతున్నారు. వైద్య విద్యార్థినులతో పాటు వాకింగ్‌ కోసం వస్తున్న మహిళలపై తరచూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీనిపై ఆర్‌ఎంసీ స్పోర్ట్స్‌ వైస్‌చైర్మన్‌ డాక్టర్‌ ఉమామహేశ్వరరావుకు మెడికోలు ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని వైద్య విద్యార్థులు అటు రంగరాయ యాజమాన్యంతో పాటు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ)కి ఫిర్యాదు చేశారు. 

అనుమతి అడిగి.. అంతలోనే గొడవకు దిగి..
తమ అనుచరులను కోర్టులో ఆడుకునేందుకు అను­మ­తివ్వాలని ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్, డీఎంఈ డాక్టర్‌ డీఎస్‌­వీఎల్‌ నరసింహాన్ని ఇటీవల ఎమ్మెల్యేలు ఇరువు­రూ ఫోన్‌లో అడిగారు. అందుకు నరసింహం అభ్యంతరం చెబుతూ.. ఉన్నత స్థాయి కమిటీలో చర్చించి చెబుతామని వారికి చెప్పారు. ఇంతలో అనుమతి లేకుండానే శనివారం కూటమి ఎమ్మెల్యేల అనుచరు­లు వాలీబాల్‌ కోర్టులో ఆటలాడు­తున్నా­రు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, ఆర్‌ఎంసీ వైస్‌ ప్రిన్సిపాల్, డాక్టర్‌ విష్ణువర్ధన్, కాలేజ్‌ స్పోర్ట్స్‌ వైస్‌ చైర్మన్, ఫోరెన్సిక్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ ఉమా­మహేశ్వరరావు, ఫోరెన్సిక్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సతీష్‌తో కలసి ఆర్‌ఎంసీ గ్రౌండ్‌కి చేరుకు­న్నారు.

కోర్టు నుంచి వెళ్లిపోవాలని ఎమ్మెల్యేల అనుచరులకు నచ్చజెప్పగా.. వారు వాగ్వాదానికి దిగారు. అనంతరం ఎమ్మెల్యే అను­చరు­లు కోర్టు ఖాళీ చేసి వెళ్లిపో­యాక ఎమ్మెల్యే నానా­జీ తన అను­చరులను వెంట బెట్టుకుని గ్రౌండ్‌కు వచ్చి డాక్టర్‌ ఉమా­మహేశ్వర­రావుపై బండ బూతులు మొదలు­పెట్టి.. ఆ డాక్టర్‌ ముఖానికి మాస్క్‌ను బలవంతంగా లాగేసి పిడిగు­ద్దులు కురి­పించారు. మరో­మా­రు తన అనుచరులను అడ్డుకుంటే చంపేస్తానని హె­చ్చ­రించి వెళ్లారు. ఆ సమయంలో ఇరు పక్షాలు గొడవకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంతలో పోలీసులు అక్క­డ­కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

నేటి నుంచి జూడాల నిరసన..
ఎమ్మెల్యే నానాజీ దౌర్జన్యానికి నిరసనగా ఆదివారం నుంచి విధులు బహిష్కరిస్తామని వైద్యులు, జూడాలు ప్రకటించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నరసింహం ఆధ్వర్యంలో వైద్యులు జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌కు జరిగిన సంఘటనపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎంఎల్‌ఏ నానాజీపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. ఇదిలా ఉండగా కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ సగిలి, జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆర్‌ఎమ్‌సీకి వచ్చి ఇరుపక్షాలతో రాజీకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు వైద్యులు, మెడికోలు ససేమిరా అంటున్నారు. దళిత సంఘాలు ఆర్‌ఎంసీ గ్రౌండ్స్‌కు చేరుకుని దళిత జాతికి జరిగిన అవమానమంటూ ధర్నాకు దిగారు.

క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి
డా.ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులు దాడికి పాల్పడటం హేయమైన చర్య అని ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా.జయధీర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, వైద్యులపై దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు ఆయన లేఖ రాశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)