Breaking News

‘తవ్వండి.. తోలండి.. మనల్ని ఎవడ్రా ఆపేది’

Published on Tue, 12/02/2025 - 07:16

బుట్టాయగూడెం: ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో జనసేన నేతలు రెచ్చిపోతున్నా­రు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ మ­న్యంలోని కొండలు, గుట్టల్ని తవ్వేస్తూ.. గ్రా­వె­ల్, మట్టిని మైదాన ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. టిప్పర్‌ రూ.5 వేల చొప్పున విక్రయాలు జరుపుతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా జేసీబీలతో తవ్వి టిప్పర్లలో తరలిస్తున్నారు. వీరి చర్యల వల్ల ఏజెన్సీలోని కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి. చివరకు పంట కాలువ గట్లు, పరిసర ప్రాంతాలను కూ­డా వదలటం లేదు. 

మట్టి, గ్రావెల్‌ తవ్వ­కాలు జరుపుతూ పగలు, రాత్రి టిప్పర్లలో తరలిస్తు­న్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరో­పణలు వినిపిస్తున్నాయి. అధికారు­ల సహకారంతోనే తవ్వకాలు సాగుతున్నాయా అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. బుట్టాయగూడెం మండలం నూతిరామన్నపాలెం సమీపంలోని కొండను నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల జేసీబీతో తవ్వి తరలించారు. తాజా­గా సోమవారం బుట్టాయగూ­డెం శివారు బూసరాజుపల్లి సమీపంలోని చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ గట్టును జేసీబీతో తవ్వి గ్రావెల్, మట్టిని తరలించడం ప్రారంభించారు. 

స్థానికులు ఫిర్యా­దు చేయడంతో ఇరిగేషన్‌ ఏఈ అక్క­డికి చేరుకుని తవ్వకాలను అడ్డుకున్నారు. అక్రమంగా మట్టి తవ్వకాలపై తహసీల్దార్‌ కార్యాలయానికి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఇరిగేషన్‌ డీఈ ఎం.నాగరాజు తెలిపారు. అయినా అక్రమ తవ్వకాలు చేస్తున్న వారిపై అధికారులు చర్య­లు తీసుకుంటారో లేదో వేచి చూ­డా­ల­ని గిరిజన సంఘాల నేతలు అంటున్నారు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)