Breaking News

జనసేన కార్యకర్తనని చిన్నచూపా?

Published on Sun, 06/29/2025 - 08:02

చిత్తూరు జిల్లా: ‘కూటమి ప్రభుత్వంలో జనసేన కార్యకర్తలను అసలు పట్టించుకోరా? బిడ్డకు లివర్‌ మార్పిడి సర్జరీ కోసం సీఎం చంద్రబాబును కలిసేందుకు సిఫార్సు లేఖపై సంతకం పెట్టమని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ రెడ్డిని అడిగితే స్థానిక టీడీపీ నాయకుల మాటలు విని సంతకం పెట్టలేదు. నా బిడ్డ చనిపోయింది’ అంటూ చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం తీర్థం పంచాయతీ కైగల్‌ గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే జనసేన కార్యకర్త మృతి చెందిన బిడ్డ, లేఖ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. అది ఇప్పుడు వైరల్‌గా మారింది.  

అందులోని విషయం ఏమిటంటే... 
శ్రీనివాసులు జనసేన పార్టీ కార్యకర్త. కూలీ చేసుకునే ఇతనికి ముగ్గురు పిల్లలు. రెండో కుమార్తె సౌమ్యకు పచ్చకామెర్లు ముదిరి కాలేయం దెబ్బతింది. దీంతో పలు ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించారు. అయితే వై­ద్యు­­లు కాలేయ మార్పిడి చేయాలని,  అందుకోసం రూ.30 లక్షల దాకా ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో సీఎం చంద్రబాబును కలిసి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సా­యం పొందే అవకాశం ఉందని కొందరు చెప్పడంతో ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ రెడ్డి సిఫార్సు సంతకం కోసం వెళ్లగా ఆయన లోకల్‌ నాయకుల మాట విని సంతకం పె­ట్ట­లేదు. పరిస్థితి విషమించి ఈ నెల 24న ఆ పాప మృతి చెందింది. 

Videos

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)