Breaking News

జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

Published on Fri, 02/13/2026 - 05:31

కర్నూలు (సెంట్రల్‌)/ఆదోని సెంట్రల్‌: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారాన్ని వాషింగ్టన్‌లోని సియోటెల్‌ సిటీ అటార్నీ జనరల్‌ ఎరికా ఇవాన్స్‌ అధికారికంగా ప్రకటించారు. ‘‘జాహ్నవి మృతి మా హృదయాలను కలచివేసింది. ఈ ఆర్థిక­సాయమైనా ఆమె కుటుంబానికి కాస్తంత ఓదార్పు అందిస్తుందని ఆశిస్తున్నాం’’ అని ఇవాన్స్‌ వెల్లడించారు.  

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన జాహ్నవి 
కర్నూలు జిల్లా ఆదోనిలోని తిరుమలగిరిలో నివాసం ఉంటున్న హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీకాంత్, విజయలక్ష్మి దంపతులు కౌతాళం మండలం కుంబళనూరు నుంచి వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు సంతానం. మొదటి కుమార్తె జాహ్నవి ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లింది. అక్కడి నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్సిటీలో మాస్టర్‌ డిగ్రీ కోర్సులో చేరింది. అయితే 2023 జనవరి 23న జాహ్నవి రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్‌ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో 100 అడుగుల దూరంలో ఎగిరిపడిన జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయింది. 

ఈ ప్రమాదానికి పోలీసు వాహనం నడుపుతున్న కెవిన్‌ డవే అనే అధికారి కారణమయ్యారు. అయితే ఆమె మృతిపై మరో అధికారి డేనియల్‌ అడరర్‌ అత్యంత నిర్లక్ష్యంగా జోకులు వేస్తూ మరో అధికారితో మాట్లాడడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ‘‘ఈమెకు 26 ఏళ్లు ఉంటాయేమో. అయినా సాధారణ వ్యక్తి. ఈమె మరణానికి ఎలాంటి విలువ లేదు’’ అని అడరర్‌ వ్యాఖ్యానించడం మరో అధికారి బాడీ కెమెరాలో రికార్డయింది. భారత విద్యార్థి మృతి, అధికారి అనుచిత వ్యాఖ్యలపై భారత్‌ భగ్గుమంది. అమెరికా పౌరులూ డేనియల్‌ అడరర్‌ తీరును ఖండించారు. దీంతో అతనిపై వేటు పడింది. విధుల నుంచి పోలీసు ఏజెన్సీ తప్పించింది. 

ఈ క్రమంలో సియాటెల్‌ సిటీ అధికారులే తమ కుమార్తె మరణానికి కారణమని 110 మిలియన్‌ డాలర్లు పరిహారంగా చెల్లించాలని జాహ్నవి కుటుంబం 2024 సెప్టెంబర్‌లో దావా వేసింది. ఈ క్రమంలో పూర్తి స్థాయి విచారణ జరిపిన వాషింగ్టన్‌ రాష్ట్రంలోని సియాటెల్‌ సిటీ అటార్నీ జనరల్‌ ఎరికా ఇవాన్స్‌ అధికారుల నిర్లక్ష్యం, అలసత్వంతోనే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించి బాధిత కుటుంబానికి పరిహారం ప్రకటించారు. ఆమె కుటుంబానికి 29 మిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.262 కోట్ల పరిహారం చెల్లించేలా అగ్రిమెంట్‌ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే బాధిత కుటుంబానికి భారత ఎంబసీ ద్వారా ఆ పరిహారం అందించేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మూడు రోజుల క్రితమే జాహ్నవి తండ్రి మృతి 
ఆదోనిలోని తిరుమలగిరిలో నివాసం ఉంటున్న జాహ్నవి తల్లిదండ్రులు కుమార్తె మరణంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు చుట్టుపక్కల వారు చెబుతున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితమే  తండ్రి శ్రీకాంత్‌ గుండెపాటుతో మరణించారు. దీంతో తల్లి విజయలక్ష్మీ, చిన్న కూతురు మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో వారికి భారీ పరిహారం అందితే ఎంతో అండగా ఉంటుంది. అయితే ఈ విషయం వారికి తెలియదు. ప్రస్తుతం వారు శ్రీకాంత్‌ మరణంతో తీవ్ర విషాదంలో ఉన్నారు.   

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు