Breaking News

YS Jagan: అచ్యుతాపురం సెజ్‌ బాధితులకు జగన్‌ పరామర్శ

Published on Fri, 08/23/2024 - 08:36

అనకాపల్లి, సాక్షి: అచ్యుతాపురం సెజ్‌ ఎసెన్షియా ఫార్మా కంపెనీ బాధితులను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. శుక్రవారం ఉదయం అనకాపల్లికి వెళ్లిన ఆయన.. ఉషా ప్రైమ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడారు.  

బాధితుల వివరాలు, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న జగన్‌.. వాళ్ల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని వాళ్లకు ధైర్యం చెప్పారు. అలాగే.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ ఆస్పత్రిలోనే 18 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 

పోలీసుల ఓవరాక్షన్‌
అంతకు ముందు.. విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన అనకాపల్లి వెళ్తుండగా పోలీసులు అతి ప్రదర్శించారు. జగన్‌ కాన్వాయ్‌ వెంట వైఎస్సార్‌సీపీ నేతలెవరూ వెళ్లకుండా వాళ్ల వాహనాల్ని అడ్డుకున్నారు. 

ఆప్యాయ పలకరింపు
జగన్‌ రాక సమాచారంతో విశాఖ ఎయిర్‌పోర్టుకు, అనకాపల్లిలోని ఆస్పత్రి వద్దకు భారీగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. వాళ్లందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించారు. ఇక ఆస్పత్రిలో సిబ్బందిని పలకరించిన జగన్‌.. సిబ్బంది కోరడంతో సెల్ఫీలు కూడా దిగారు. 



జగన్‌ ఒత్తిడికి తలొగ్గి.. 
అచ్యుతాపురం బాధితుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ఘటన జరిగిన వెంటనే.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. చనిపోయిన వారి కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో.. జగన్‌తో పాటు బాధిత కుటుంబాల ఒత్తిడి మేరకు నిన్న సీఎం చంద్రబాబు కోటిరూపాయల పరిహారం ప్రకటన చేశారు. అలాగే బాధితుల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలు రాగా.. విశాఖలోని మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తోంది ప్రభుత్వం. 

 

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)