Breaking News

సాక్షిపై విషం చిమ్ముతూ.. మరింత దిగజారిన టీడీపీ!

Published on Wed, 06/11/2025 - 11:42

సాక్షి, అమరావతి: అధికార పార్టీ తెలుగు దేశం మరింత దిగజారిపోయింది. అమరావతి మహిళలను టీవీ డిబేట్‌లో అగౌరవపరిచారంటూ సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావుపై తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేయించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో.. సాక్షి మీడియా సంస్థ కార్యాలయాలపైనా దాడులకు తెగబడుతోంది.  ఇప్పుడేమో సోషల్‌ మీడియా వేదికగానూ అసత్య ప్రచారాలతో ‘సాక్షి’పై విషం చిమ్ముతోంది.

తాజాగా..  ఏలూరు సాక్షి కార్యాలయానికి టీడీపీ నేతలు నిప్పు పెట్టి ఫర్నీచర్‌ను దహనం చేసిన సంగతి తెలిసే ఉంటుంది. మూడు రోజులుగా ఆఫీస్‌ వద్ద నిరసలు చేస్తూ.. మంగళవారం సాయంత్రం రెచ్చిపోయారు. తొలుత దెందులూరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు కార్యాలయంపై కోడిగుడ్లు విసిరారు. ఆపై కార్యాలయం కింద ఉన్న ఫ్లెక్సీతో పాటు ఫర్నీచర్‌ను తగలబెట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది కూడా. అయితే.. 

టీడీపీ సోషల్‌ మీడియా వింగ్‌ ఐ టీడీపీ, ఆ పార్టీ అధికారిక ఫేస్‌బుక్‌, ట్విట్టర్ ద్వారా సాక్షిపై తప్పుడు ప్రచారానికి దిగింది. సాక్షి కార్యాలయానికి తమ పార్టీ శ్రేణులు నిప్పు పెట్టలేదని, సంస్థ ఉద్యోగులే నిప్పు పెట్టి సీసీ ఫుటేజీ దొరక్కుండా మాయం చేశారంటూ కట్టుకథలు అల్లి ప్రచారం చేస్తోంది. మరోవైపు.. పోలీసులేమో భిన్నమైన ప్రకటన ఒకటి చేయడం కొసమెరుపు. 

కార్యాలయం వద్ద జరిగిన దాడికి, సాక్షికి అసలు సంబంధమే లేదంటూ కాలిన ఫర్నీచర్‌ యాజమానితో చెబుతున్నారు(పోలీసులే చెప్పించారు!). ఇలా.. పరస్పర విరుద్ధ ప్రచారాలతో టీడీపీ అడ్డంగా దొరికిపోయినట్లైంది. టీడీపీ శ్రేణుల తీరుతో ప్రజల్లో వ్యతిరేకత రావటంతోనే ఇలా కొత్త డ్రామాలకు తెరలేపినట్లు స్పష్టమవుతోంది.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)