Breaking News

విచారణకు సహకరించకుంటే బెయిల్‌ రద్దు కోరండి: సుప్రీంకోర్టు

Published on Mon, 01/29/2024 - 07:28

ఢిల్లీ: ఐఆర్‌ఆర్‌(ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌) భూకుంభకోణం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై నేడు(సోమవారం) సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.  ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై.. జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. బాబు దర్యాప్తుకు సహకరించకపోతే బెయిల్ రద్దుకు తమను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ దశలో జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. 

కాగా ఇన్నర్‌ రింగ్‌ భూ కుంభకోణం, ఉచిత ఇసుక, మద్యం విధానాల్లో అక్ర­మాలపై సీఐడీ నమోదు చేసిన కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు­కు హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చింది. అలాగే మద్యం కేసులో నిందితులు­గా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర,  ఎక్సై­జ్‌ శాఖ అప్పటి కమిషనర్‌ శ్రీ నరేష్ లకు కూడా ముందస్తు బెయిల్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. కాగా, ఈ బెయిల్‌ను సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. 

ఏపీ ప్రభుత్వ పిటిషన్‌లో ముఖ్యమైన అంశాలు

  • జి టు జి పేరుతో నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెట్టారు
  • ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ లో అక్రమంగా మార్పులు చేశారు
  • తమ భూములకు అనుకూలంగా రోడ్డు మార్పులు చేశారు 
  • దీనికి ప్రతిఫలంగా పెద్ద ఎత్తున ముడుపులు అందుకున్నారు 
  • ఈ కుంభకోణానికి ముఖ్య సూత్రధారి చంద్రబాబు, నాటి మున్సిపల్ మంత్రి నారాయణ 
  • తమకు ముడుపులు ఇచ్చిన వారిని దుబాయ్, అమెరికాకు పారిపోయేలా సహకరించారు. 
  • ముందస్తు బెయిల్ వల్ల కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతున్నారు.
  • నోటీసులు అందుకున్న నిందితులు ఇప్పటికే కొంతమంది పరారయ్యారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)