Breaking News

వికృత చేష్టలకు బలైన విద్యార్థిని

Published on Thu, 12/04/2025 - 08:29

ఆ చిన్నారి భవిష్యత్‌పై ఎన్నో కలలు కనింది. బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకుంది. తనకోసం రేయింబవళ్లు కష్టపడుతున్న తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనుకుంది. అందుకే వ్యయప్రయాసల కోర్చి ధర్మవరానికి వెళ్లి మరీ చదువుకునేది. కానీ బస్సులో ఓ విద్యార్థి తనకు చేసిన అవమానాన్ని తట్టుకోలేక ఉరివేసుకున్న ఆ విద్యార్థిని ఎనిమిది రోజులు మృత్యువుతో పోరాడి అలసిపోయింది. బుధవారం సాయంత్రం జీవితాన్ని ముగించింది.

సత్యసాయి జిల్లా: మండల పరిధిలోని పులేటిపల్లికి చెందిన స్పందన(17) ధర్మవరంలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రోజూ గ్రామం నుంచి ధర్మవరానికి బస్సులో వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో ఎనిమిది రోజుల క్రితం కళాశాలకు బస్సులో వెళ్తున్న క్రమంలో ఓ విద్యార్థి ఆమెతో ఆసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె అతన్ని మందలించింది. 

దీంతో పట్టరాని కోపంతో ఆ విద్యార్థి బస్సులో ప్రయాణికుల ముందే స్పందనపై రెండుసార్లు దాడి చేశాడు. ఘటనపై స్పందన ధర్మవరం పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. పోలీసులు తమ పరిధిలోకి రాదని తప్పించుకున్నారు. చెన్నేకొత్తపల్లి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేయగా.. అతడిని పిలిపించి మందలిస్తామన్నారు. ఓ బాలికపై భౌతిక దాడి చేస్తే మందలిస్తారా.. అంతేనా.. అని బాధపడిన చిన్నారి ఇంటికి వెళ్లి ఉరి వేసుకుంది. కుటుంబీకులు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. 

ఎనిమిది రోజుల పాటు ఆసుపత్రిలో  మృత్యువుతో పోరాటం చేసిన బాలిక చివరకు మృత్యువు ఒడిలోకి చేరింది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. విద్యార్థిని పట్ల  అసభ్యకరంగా ప్రవర్తించి ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించినట్లుగా యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)