Breaking News

ఇంటర్‌ ప్రత్యేక తరగతులు ప్రారంభం

Published on Wed, 05/03/2023 - 04:04

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుతూ ఇంటర్మీడియెట్‌ ఫెయిలైన విద్యార్థుల కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వారికోసం ప్రత్యేక శిక్షణ తరగతులు (రెమిడియల్‌ శిక్షణ)కు శ్రీకారం చుట్టింది. వీరందరికీ ఈ నెల 21 వరకు (21 రోజులపాటు) తరగ­తులు నిర్వహించి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయనుంది. సోమవారం నుంచి ప్రారంభమైన శిక్షణకు విద్యార్థుల సంఖ్యను అను­సరించి అధికారులు ఏర్పాట్లు చేశారు.

మూడు సబ్జెక్టుల లోపు ఫెయిలైన వారికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, అంతకంటే ఎక్కువ సబ్జె­క్టులు పోయినవారికి సాయంత్రం వరకు తరగ­తులు నిర్వహించేలా ఇంటర్‌ బోర్డు చర్యలు తీసు­కుంది. రెండు షిఫ్టుల్లో తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అంది­స్తారు. తరగతుల నిర్వహణ, కాలేజీలను జిల్లా కలె­క్టర్లు పర్యవేక్షిస్తారు. విద్యార్థుల సంఖ్యకు అను­గు­ణంగా రెసిడెన్షియల్‌ తరహా శిక్షణపై కూడా అధికారులు దృష్టి సారించారు. విద్యార్థుల ఆసక్తి మే­రకు డివిజనల్‌ కేంద్రాల్లో హాస్టల్‌ వస­తి కల్పించి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. 

ఫెయిలైన బాలికలకు ప్రత్యేక ఏర్పాట్లు
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలైన బాలికలకు కూడా రెసిడెన్షియల్‌ శిక్షణ అందించడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి పూర్తి రక్షణ వాతావరణం ఉండే కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో వసతి, శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థులు తమకు నచ్చిన విధానం ఎంచుకుని తరగతులకు హాజరు కావచ్చు.

బీసీ గురుకులాల్లో ఫెయిలైన విద్యార్థులు 195 మంది ఉండగా.. వారికి ఆన్‌లైన్, రెసిడెన్షియల్‌ విధానంలో తరగతులు నిర్వహిస్తున్నారు. 10 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే వారికి ఆన్‌లైన్‌లోనూ, అంతకు మించి విద్యార్థులు ఉన్నచోట 14 సెంటర్లలో రెసిడెన్షియల్‌ తరగతులకు శ్రీకారం చుట్టారు. ఇంటర్‌ పాసైనా మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్‌మెంట్‌ రాసే విద్యార్థులు కూడా రెమిడియల్‌ శిక్షణ తరగతులకు హాజరు కావచ్చని ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు. 

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు నేడు ఆఖరు
ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు ఫీజు చెల్లించడానికి మే 3 చివరి తేదీ అని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఈ నెల 24 నుంచి జూన్‌ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు బుధవారం సాయంత్రంలోగా ఫీజు చెల్లించాలని ఇంటర్‌ బోర్డు పేర్కొంది. 

Videos

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)