Breaking News

రిజిస్ట్రేషన్‌ కాగానే యాజమాన్య హక్కు

Published on Thu, 06/22/2023 - 04:40

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆటో మ్యుటేషన్‌ విధానం త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న మ్యుటేషన్‌ (యాజమాన్య హక్కు బదిలీ) విధా­నాన్ని సులభతరం చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకురానుంది. స్థిరాస్తుల క్రయవిక్రయాలు జరిగిన తర్వాత వాటిని తమ పేరు మీదకు మార్చుకోవ­డం ఇప్పుడున్న విధానంలో క్లిష్టతరంగా ఉంది. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత మళ్లీ మ్యుటేషన్‌ కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకోవడం, నిర్దిష్ట గడువులో ఆ శాఖ దాన్ని పూర్తి చేయడానికి కొంత సమయం పడుతోంది.

మధ్య­లో కొన్ని వివాదాలకు సైతం ఆస్కారం ఏర్పడుతోంది. గతంలో ఎంతో ప్రహ­సనంగా ఉన్న మ్యుటేషన్‌ ప్రక్రియను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక నిరంతరం సమీక్షలతో ఎప్పటికప్పుడు క్లియర్‌ చేస్తున్నా.. మరింత సులభతరం చేయా­లని నిర్ణయించారు. అందులో భాగంగానే ఎంతోకాలం నుంచి కాగితాలకే పరిమితమైన ఆటో మ్యుటేషన్‌ ప్రతిపాదనను వాస్తవ రూపంలోకి తీసుకు రానున్నారు.  

రూపొందిన ప్రత్యేక అప్లికేషన్‌.. 
ఇందుకోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్‌వేర్‌కు, రెవెన్యూ శాఖ వెబ్‌ల్యాండ్‌ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేస్తున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక అప్లికేషన్‌ను రూపొందించారు. తత్ఫలితంగా ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్‌ జరిగిపోతుంది. రిజిస్ట్రేషన్‌ జరిగిందంటే రెవెన్యూ రికార్డుల్లోనూ యాజమాన్య హక్కు దానంతట అదే మారిపోతుంది.

రెవెన్యూ వ్యవస్థలో ఇది అత్యంత కీలకమైన మార్పుగా చెబుతున్నారు. ఆటో మ్యుటేషన్‌ విధానాన్ని తొలుత భూముల రీ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో అమల్లోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన టెస్టింగ్‌ ప్రక్రియ కూడా పూర్తయింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఆటో మ్యుటేషన్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

Videos

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)