Breaking News

ప్రభుత్వానికి భూములు ఎందుకివ్వాలి?

Published on Sat, 03/07/2026 - 05:06

సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు ఎడ్యుకేషన్‌ : అమరావతి రాజధాని పేరుతో సంవత్సరానికి మూడుపంటలు పండే భూములను తీసుకోవద్దన్న సూచనలు, సలహాలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకుండా ఆ భూములను కాంక్రీట్‌తో నింపేశారని రైతునేత వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. భూసేకరణ సమయంలో ఇచి్చన హామీలకు దిక్కు ఎవరని ప్రశ్నించారు. రాజధాని పేరుతో రైతుల నుంచి అడ్డగోలుగా భూములు లాక్కుని వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. రెండోవిడత భూసేకరణకు రైతులు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. 

ల్యాండ్‌ పూలింగ్‌ రెండోదశకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చావేదిక శుక్రవారం గుంటూరులో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన ముఖ్యవక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నిర్మాణమే లేని రాజధానిలో ఐదువేల ఎకరాల్లో ఎయిర్‌పోర్టు, 1,500 ఎకరాల్లో రైల్వేస్టేషన్‌ అంటూ సీఎం చంద్రబాబు, మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు. సీఆర్‌డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందానికి చట్టబద్ధత లేదని, మొదటివిడతలో భూములిచ్చిన రైతులు నెత్తీనోరు బాదుకుంటున్నారని చెప్పారు. 

రెండోవిడత భూములు తీసుకునేముందు మొదటివిడతలో భూములిచి్చన రైతులకు ఏం న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన మెడికల్‌ కళాశాలల నిర్మాణాలను పూర్తిచేసేందుకు రూ.4,400 కోట్లు లేవని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతి చుట్టూ నిర్మించేందుకు ప్రతిపాదించిన ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌)కు రూ.వేలకోట్లు ఏ విధంగా ఖర్చుచేస్తుందని ప్రశ్నించారు. 

మొదటివిడతలో భూములిచ్చిన రైతుల పిల్లల కోసం ఉచిత విద్య, వైద్య సదుపాయాలను కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్న చంద్రబాబు సర్కారు.. రెండోవిడతకు వచ్చేసరికి దాన్ని ఉచిత విద్య, వైద్యానికి అర్హులు అని మార్పులు చేయడంతోనే భూసేకరణ వి«ధానంలోనే లోపముందని అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. రైతుల అంగీకారం లేకుండా సెంటు భూమి కూడా సైతం తీసుకోలేరని స్పష్టం చేశారు. భూముల కోసం వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు భూములిచ్చేది లేదని తెగేసి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు కుర్రా వసుంధర, మహదేవ్, విశ్రాంత ప్రొఫెసర్‌ సి.రామచంద్రయ్య, మెడికల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు, చార్టర్‌ అకౌంటెంట్‌ పి.మల్లికార్జునరావు, హైకోర్టు న్యాయవాది కేవీఎం రజని, ప్రొఫెసర్‌ ఎన్‌.వేణుగోపాలరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయరెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)