Breaking News

బంగారు కొండ..'భారత్‌'.. జీడీపీని దాటేసిన భారతీయుల బంగారం

Published on Sun, 01/25/2026 - 04:35

సాక్షి, అమరావతి: బంగారం... భారతీయుల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసింది. అంతర్జాతీయంగా పరు­గులు తీస్తున్న బంగారం ధరలతో భారతీయుల సంపద కూడా అంతే వేగంతో పెరుగుతోంది. ప్రస్తుతం భారతీయుల వద్ద ఉన్న బంగారం విలువ దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)ని అధిగమించేసిందంటే ఏ స్థాయిలో ప్రజల వద్ద బంగారం ఉందో అర్థం చేసుకోవచ్చు. భారతీయుల వద్ద ఉన్న బంగారం విలువ తొలిసారిగా 5 ట్రిలియన్‌ డాలర్ల (రూ.450 లక్షల కోట్ల) మార్కును దాటేసింది. ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ (ఐఎంఎఫ్‌) అంచనాల ప్రకారం... ప్రస్తు­తం భారతదేశ జీడీపీ 4.1 ట్రిలియన్‌ డాలర్ల (రూ.387 లక్షల కోట్లు) వద్దే ఉంది. 

2025లో బంగారం 65 శాతం పెరిగి పది గ్రా­ముల బంగారం ధర రూ.1.40 లక్షలకు చేరినప్పుడు.. భారతీయుల బంగారం విలువ 5 ట్రిలియన్‌ డాలర్లను దాటినట్లు మోర్గాన్‌స్టాన్లీ నివేదిక వెల్లడించింది. ఇప్పుడు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1.55 లక్షలు దాటడంతో ఈ విలువ మరింత పెరిగింది. భారతీయుల వద్ద ఆభరణాలు, తదితరాల రూపంలో 34,600 టన్నుల బంగారం ఉందని.. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర 4,500 డాలర్లు అధిగమించడం ద్వారా భారతీయుల బంగారం విలువ దేశ జీడీపీని అధిగమించిందని మోర్గాన్‌స్టాన్లీ పేర్కొంది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర 4,987 డాలర్లు అధిగమించింది. 

ఇది కాకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) వద్ద 880 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. గత రెండేళ్లలో ఆర్బీఐ 75 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. మొత్తం విదేశీ మారక నిల్వల్లో ఆర్‌బీఐ బంగారం వాటా సుమారు 14 శాతానికి సమానమట. అయితే మొత్తం 34,600 టన్నుల బంగారంలో 80 శాతం ఆభరణాల రూపంలోనే ఉందని నివేదిక వెల్లడించింది. ఇప్పుడిప్పుడే బంగారాన్ని ఒక పెట్టుబడి సాధనంగా భారతీయులు భావించడం మొదలు పెట్టారని తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో బంగారం కడ్డీలు, నాణేల కొనుగోళ్లలో 24 శాతం పైన వృద్ధి నమోదవ్వడమే ఇందుకు సంకేతం. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)