Breaking News

‘వేలంపాడు ప్రమాదం.. మాకేం సంబంధం లేదు’

Published on Mon, 12/01/2025 - 12:01

తిరుపతి, సాక్షి : శ్రీకాళహస్తి మండలం వేలంపాడు గ్రామంలో ఇటీవల ఘోరం జరిగింది. ఓ టైల్స్‌ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఇద్దరు మృతి చెందారు. అయితే ఈ ఘటనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్పొరేట్ కీలక ప్రకటన చేసింది.

ప్రమాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ చీఫ్ జనరల్ మేనేజర్ వీ వెట్రిసెల్వకుమార్ అంటున్నారు. ‘‘ఆ ప్రమాదం ఎల్పీజీ ట్యాంకర్ ట్రక్ పేలుడు వల్ల జరగలేదు. పరిశ్రమ ప్రాంగణంలో ఒక ప్రైవేట్ ఆపరేటర్ నైట్రోజన్‌తో వెసల్/ట్యాంక్‌కు ప్రెజర్ టెస్టింగ్ నిర్వహిస్తుండగా జరిగింది. అందువల్ల ఆ ఘటనతో ఎల్పీజీకి ఎటువంటి సంబంధం లేదు’’ అని ఒక ప్రకటనలో  స్పష్టత ఇచ్చారాయన.

వేలంపాడు సోమేనీ ఫ్యాక్టరీలో నైట్రోజన్‌ గ్యాస్‌ పేలడంతో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి గాయలయ్యాయి. క్షతగాత్రులను వెంకటగిరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మృతుల్ని చీరాలకు చెందిన పోతురాజు, ఒడిశాకు చెందిన పాండే గా గుర్తించారు. అయితే.. ఘటన తర్వాత బాధిత కుటుంబాలను, వైద్య సిబ్బందిని, మీడియాను లోపలకు అనుమతించకపోవడంతో యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)