Breaking News

‘పెద్దన్న’తో విన్యాసాలు

Published on Sat, 03/29/2025 - 05:01

సాక్షి, విశాఖపట్నం: అమెరికాతో సత్సంబంధాలు మెరుగుపడేలా.. దాయాది దేశాల్లో వేళ్లూనుకుంటున్న ఉగ్రవాదానికి హెచ్చరికలు జారీ చేసేలా 2019 నుంచి నిర్వహిస్తున్న త్రివిధ దళాల సంయుక్త విన్యాసాలకు విశాఖ నగరం మరోసారి ఆతిథ్యమిస్తోంది. ఏప్రిల్‌ 2 నుంచి ప్రారంభమయ్యే విన్యాసాల్లో భారత్‌ తరఫున ఐఎన్‌ఎస్‌ జలాశ్వ యుద్ధ నౌక ప్రాతినిధ్యం వహి­­స్తోంది. వరుసగా నాలుగో పర్యాయం విశాఖలోనే నిర్వహిస్తుండటం విశేషం.ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ త్రివిధ దళాల వి­న్యాసాలను ‘టైగర్‌ ట్రయాంఫ్‌’ గా పిలుస్తుంటారు.  

2019 నుంచి ప్రారంభం  
భారత్, అమెరికాల్లో సైనిక, వైమానిక, నౌకాదళ విన్యాసాలు వేర్వేరుగా జరిగాయి. కానీ 2019లో తొలిసారిగా..మూడు విభాగాలు కలిపి విన్యాసాల్లో ప్రప్రథమంగా పాల్గొనడంతో అన్ని దేశాలూ భారత్‌–అమెరికా మధ్య బంధం గురించి చర్చించుకున్నాయి. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగు,  భద్రతా పరమైన అంశాల్లో పరస్పర సహకారం, విపత్తు సమయంలో ఒకరికొకరు సాయం చేసుకునేందుకు అవసరమైన విధానాలను బలోపేతం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటున్నాయి. 

అనుమానాలను పటాపంచలు చేస్తూ.. 
ఈ ఏడాది జనవరిలో ఇరుదేశాల రక్షణ శాఖల అధికారులు సమావేశమై విన్యాసాలపై చర్చించారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో..టైగర్‌ ట్రయాంఫ్‌ జరగదేమో అనుకున్నారంతా. 
కానీ  వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ‘టైగర్‌ ట్రయాంఫ్‌’– 4 ప్రారంభం కానుండటంతో ప్రధాన దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

టైగర్‌ ట్రయాంఫ్‌
వేదిక: విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం
ఎడిషన్‌: 4 
ప్రారంభం: ఏప్రిల్‌ 02, 2025  

లక్ష్యం 
» ఇండో పసిఫిక్‌ సాగర జలాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడం 
»   ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా ఆయుధ సంపత్తి సత్తా చాటడం 
»   ఇండో–పసిఫిక్‌ జలాల్లో అక్రమ రవాణా, చోరీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట. 

విన్యాసాలు చేసేది.. వీళ్లే  
» అమెరికా తరపున  మెరైన్స్, సెయిలర్స్, ఎయిర్‌మెన్‌లు 
» భారత్‌ సైనిక దళం, నావికులు, ఎయిర్‌మెన్‌లు 
»   భారత్‌ తరపున ఐఎన్‌ఎస్‌ జలాశ్వ  
»  అమెరికా యుద్ధ నౌకలు

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)