Breaking News

నా భారత్‌.. బంగారం..!

Published on Wed, 07/02/2025 - 04:56

సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా పరుగులు తీస్తున్న బంగారం ధరలతో భారతీయుల సంపద విలువ అంతే వేగంతో పెరుగుతోంది. ప్రస్తుత ధరల ప్రకారం భారతీయుల వద్ద దాదాపు రూ.204 లక్షల కోట్ల (2.4 ట్రిలియన్‌ డాలర్లు) విలువైన బంగారం ఉందని స్విస్‌ ఆర్థిక సేవల సంస్థ– యూబీఎస్‌ అంచనా వేసింది. ఆది నుంచి బంగారంపై విపరీతమైన మక్కువ కలిగిన భారతీయుల వద్ద 25,000 టన్నులకుపైగా (దేవాలయాలతో కలిపి) ఉన్నట్లు యూబీఎస్‌ పేర్కొంది. 

అంతర్జాతీయ మార్కెట్లో 2020 నుంచి బంగారం విలువ రెండు రెట్లు పైగా పెరిగితే ఒక్క 2025 సంవత్సరంలోనే 25 శాతం పెరగడంతో భారతీయుల వద్ద ఉన్న బంగారం విలువ భారీగా పెరిగిందని, ఇది దేశ జీడీపీలో 56 శాతానికి సమానమని పేర్కొంది.  అంతేకాదు అభివృద్ధి చెందిన దేశాలు ఇటలీ (2.4 ట్రిలియన్‌ డాలర్లు), కెనడా (2.33 ట్రిలియన్‌ డాలర్ల) జీడీపీకి సమానంగా భారతీయులు బంగారాన్ని కలిగి ఉన్నారని తెలిపింది.  

అదే మన పక్క దేశం పాకిస్థాన్‌ జీడీపీ కంటే మన దగ్గర ఉన్న బంగారం విలువ ఆరు రెట్లు అధికం కావడం గమనార్హం.  మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటు వ్యక్తుల వద్ద బంగారంలో అత్యధికంగా 14 శాతం వాటాతో ఇండియా అగ్రస్థానంలో ఉందని యూబీఎస్‌ తన నివేదికలో పేర్కొంది. నివేదికలోని మరికొన్ని అంశాలు...

తాకట్టుకూ ఇష్టపడటం లేదు...
భారతీయుల సంప్రదాయం ప్రకారం బంగారంతో విడదీయరాని ఆధ్యాతి్మక అనుబంధం కూడా ఉంది. దీనితో వాటిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడానికి కూడా చాలా మంది ఇష్టపడటం లేదు. భారతీయులు తమ వద్ద ఉన్న బంగారంలో రెండు శాతం మాత్రమే తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. అలాగే కేంద్రం ప్రవేశపెట్టిన గోల్డ్‌ మోనటైజేషన్‌ స్కీం, సావరిన్‌  గోల్డ్‌ బాండ్‌ పథకాలు కూడా విఫలమయ్యాయి. భౌతిక కొనుగోళ్లనే ఇష్టపడ్డం, పసిడి విక్రయాలకు ససేమిరా అనడం దీనికి ప్రధాన కారణం.

» అంతర్జాతీయంగా యుద్ధభయాలు , ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో బంగారం ధరలు మరింత పెరిగే  అవకాశం ఉంది.  దీంతో భారతీయుల సంపద మరింత పెరగనుంది.
»  బంగారంలో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి.
» బంగారం ధరలు భారీగా పెరుగుతున్నా, భారతీయులకు బంగారంపై మక్కువ తీరడం లేదు. కొనుగోళ్లకు వెనుకడుగు వేయడం లేదు.
» 2025లో 782 టన్నుల బంగారాన్ని భారత్‌  కొనుగోలు చేస్తుందని అంచనా. అయితే ఇప్పుడు ఆభరణాల కంటే పెట్టుబడుల రూపంలో అంటే నాణేలు, బంగారు కడ్డీల రూపంలో అధికంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి.  బంగారం ఆభరణాల కొనుగోళ్లలో స్వల్ప క్షీణత నమోదవుతున్నప్పటికీ, నాణేలు, బంగారు కడ్డీల కొనుగోళ్లలో వార్షికంగా 25 శాతం పెరుగుదల నమోదవుతోంది.
» గతేడాది కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్‌ డ్యూటీ 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గడంతో బంగారంలో పెట్టుబడి గణనీయంగా పెరుగుతోంది.
»  వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన కమిషన్‌ అమలు చేయనుండటంతో బంగారం కొనుగోళ్లు మరింత పెరుగుతాయని అంచనా.

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)