Breaking News

జగనన్న కాలనీలపై అను'గృహం' కలిగేనా?

Published on Wed, 11/26/2025 - 09:47

దగదర్తి: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో జగనన్న కాలనీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా సొంతిళ్లు  లేని పేదలకు ఇంటి స్థలాలను కేటాయించడమే కాకుండా పక్కాగృహాలను సైతం మంజూరు చేసింది. 2024 ఎన్నికల నాటికి కొందరు గృహాలను పూర్తి చేసుకోగా, మరికొందరు వివిధ స్థాయిల వరకు నిర్మాణాలను చేపట్టారు. 

ఆ తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం బిల్లుల చెల్లింపులు చేయకపోవడంతో గృహ నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. గత ప్రభుత్వం గృహ లబ్ధిదారులకు అందించేందుకు హౌసింగ్‌ కార్యాలయానికి సరఫరా చేసిన చువ్వను కూడా పంపిణీ చేయలేదు. రెండేళ్లుగా హౌసింగ్‌ కార్యాలయంలో లక్షలాది రూపాయల విలువైన చువ్వ తుప్పు పట్టిపోతున్నా హౌసింగ్‌ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 
1500 పక్కాగృహాలు మంజూరు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మండలంలోని 20 పంచాయతీల్లో 12 చోట్ల జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టారు. అందులో సొంతిళ్లు లేని పేదలకు స్థలాలను కేటాయించారు. సుమారు 1500 పక్కాగృహాలను మంజూరు చేశారు. అందులో ఎన్నికలకు ముందే  సుమారు 650 గృహ నిర్మాణాలను పూర్తి చేయగా లబ్ధిదారులు బిల్లులు చెల్లింపులు చేశారు. మరో 67 గృహాలను స్లాబు దశ వరకు నిర్మాణం చేపట్టారు. మిగిలిన గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. 

కూటమి ప్రభుత్వం వచ్చాక మిగిలిన వాటిలో ఒక్క గృహ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేదు. గృహ లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిర్మాణాలను పూర్తి చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించారు. కనీసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన ఇనుమును కూడా పంపిణీ చేయలేదు. దీంతో రెండేళ్లుగా మండల హౌసింగ్‌  కార్యాలయం బయట లక్షలాది రూపాయల విలువైన ఇనుము వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతూ తుప్పు పడుతోంది. 

గతంలో మంజూరు చేసిన ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు ప్రస్తుతం బిల్లులు చెల్లింపులు చేస్తామని, గృహ నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని గృహ నిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పిల్లర్లు, స్లాబు నిర్మించుకుంటామన్న లబ్ధిదారులకు తుప్పు పట్టిన ఇనుమును పంపిణీ చేస్తున్నారు. తుప్పు పట్టిన ఇనుముతో నిర్మాణం చేపడితే నాణ్యత ఎలా ఉంటుందని  లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.   

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)