Breaking News

ఖాకీనంటూ... మహిళలకు ట్రాప్‌!

Published on Mon, 09/01/2025 - 04:06

నరసరావుపేట టౌన్‌: సీసీఎస్‌ ఎస్సైనని, తక్కువ ధరకు రికవరీ బంగారం ఇస్తానని నమ్మబలుకుతూ  మహిళలను వంచిస్తున్న నకిలీ ఖాకీ గుట్టు రట్టయింది. పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన ఈ మోసగాడి గురించి సేకరించిన వివరాల ప్రకారం.. నకరికల్లుకు చెందిన మేకల సాయికుమార్‌ తన పేరును ట్రూ కాలర్‌లో  క్రైమ్‌ ఎస్‌ఐ విజయ్‌గా వచ్చేలా చేసి, మహిళా ఉద్యోగులు టార్గెట్‌గా ఫోన్లు చేస్తాడు. కాల్‌ చేసిన వెంటనే తాను ఎస్‌ఐ అంటూ పరిచయం చేసుకుని మాటలతో మభ్యపెడతాడు.

కొన్ని రోజుల తర్వాత దొంగతనం కేసులో బంగారం రికవరీ చేశామని, ఇందులో కొంత పక్కకు తీశానని చెబుతాడు. ఆ బంగారాన్ని తక్కువ ధరకు ఇస్తానని నమ్మబలికి వారి నుంచి నగదు కాజేస్తాడు.  మరికొందరికి  బంగారాన్ని ఆశగా చూపి లోబర్చుకుంటాడు. ఆ తరువాత వారితో సన్నిహితంగా ఉన్న ఆడియో, వీడియోలను చూపి బెదిరింపులకు పాల్పడి డబ్బులు, బంగారాన్ని బలవంతంగా గుంజుకుంటాడు.

ఈ నేపథ్యంలో నరసరావుపేటకు చెందిన ఒక మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో  నిందితుడిని పోలీసులు వలపన్ని పట్టుకు­న్నారు. నిందితుడు ఏడు మొబైల్స్‌ వినియోగించినట్లు సమాచారం. ఇప్పటి వరకు అతని చేతిలో మోసపో­యిన మహిళలు ఆరుగురు ముందుకొచ్చారని   నరస­రావుపేట రూరల్‌ సీఐ పసుపులేటి రామకృష్ణ తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)