Breaking News

మద్యం మత్తులో తండ్రిని నరికి చంపిన తనయుడు

Published on Tue, 02/24/2026 - 06:07

కొండిపర్రు(పామర్రు): పొయ్యిలో మంట ఎందుకు ఎక్కువగా పెట్టావని తిట్టిన తండ్రిని మద్యం మత్తులో ఉన్న కుమారుడు  హత్య చేశాడు. ఈ ఉన్మాదం కృష్ణా జిల్లా పామర్రు మండలం కొండిపర్రు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. పామర్రు పోలీసుల కథనం మేరకు.. కొండిపర్రు గ్రామశివారు డీపీగూడెంలో చదువుల సురేష్(45)కుమారుడు చంద్ర మహేష్‌ నివసిస్తున్నారు. సురేష్‌ భార్య గతంలో మృతి చెందింది. 22 ఏళ్ల చంద్రమహేష్‌ పనీపాట చేయకుండా తాగి తిరుగుతుంటాడు. ఆదివారం రాత్రి చంద్ర మహేష్‌ పొయ్యి వెలిగించి నీరు కాస్తున్నాడు.

ఆ సమయంలో తండ్రి సురేష్‌ వేడి నీరు తోడుతూ ఎందుకు ఇంత పెద్ద మంట పెట్టావు అని తిట్టాడు. మద్యం మత్తులో ఉన్న చంద్రమహేష్‌ ఆగ్రహంతో అక్కడే ఉన్న కత్తి తీసి తండ్రి మెడతో పాటు ఇంకా రెండు చోట్ల నరికాడు. సురేష్‌ రక్తపు మడుగులో కొట్టుకుంటుండగా స్థానికులు మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గం మధ్యంలోనే సురేష్‌ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పామర్రు సీఐ సుభాకర్‌ తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)