Breaking News

బంగారు బాల్యం..బాధ్యతతో పదిలం

Published on Tue, 12/10/2024 - 05:21

సాక్షి రాయచోటి : భావి భారత పౌరులు.. అలాంటి చిన్నారులు చేస్తున్న వికృత చేష్టలు సమాజం ఎటుపోతుందోనన్న సందేహాలకు సమాధానం దొరకని పరిస్థితి. బాలల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఒక్క ఉపాధ్యాయులదే కాదు..సమాజంలో తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. చిన్నారులు ఏం చేస్తున్నారో..ఎటు పోతున్నారో.. ఎలా వ్యవహారిస్తున్నారో చూసుకో కపోతే అనేక తప్పులకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఒకటి, రెండు దశాబ్దాల కిందట నాగరిక పోకడలు అంతగా లేని కాలంలో...చిన్న పిల్లలు, బాలలు తల్లిదండ్రులను అంటిపెట్టుకుని చెప్పిందే వేదంగా నడిచే పరిస్థితి ఉండేది.

కాలం మారింది, కంప్యూటర్‌ పోకడలు పెరిగిన ప్రస్తుత కాలంలో చిన్నారులు అడిగిందే తడవుగా ఏదీ కాదనలేదన్నది ఇప్పటి పరిస్థితి. భావి భారత బాలలకు ఇది తప్పు, అది ఒప్పు అని చెప్పకపోతే భవిష్యత్‌లో ఎలాంటి తప్పుడు పనులు చేసినా అది అందరిమీద పడుతుంది. ఒకనాడు ఇంటి పని మొదలుకొని పాఠశాల ముగియగానే ఇంటికి చేరుకుని కుటుంబీకులతో తిరుగుతుండడంతో వారి ప్రవర్తన, నియమావళి తెలిసేది. ప్రస్తుతం సమాజంలో ఒకరితో ఒకరు పోటీపడుతూ ముందుకు వెళుతూ టెక్నాలజీ యుగంలో విలాసవంతానికి పోతుండడంతో అనుకోని ఘటనలు ఎదురవుతున్నాయి.   

సెల్‌ఫోన్లు చూస్తున్నారంటే అప్రమత్తంగా ఉండాలి 
చిన్నారులు, బాలలు (18 ఏళ్లలోపు) సెల్‌ఫోన్లు చూస్తున్నారంటే కొంచెం కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఇంటర్నెట్‌ ప్రపంచంలోకి వెళితే అనేక రకాల వెబ్‌సైట్లు అందుబాటులోకి వస్తాయి. పైగా సైబర్‌ నేరాలు పెరిగిపోయాయి. అవతలి వారు పంపిన లింక్‌ౖò­³ ఒక చిన్న క్లిక్‌ చేస్తేనే ఖజానా ఖాళీ అవుతుంది.

అదొ­క్కటే కాదు...అనేక రకాల అశ్లీల బొమ్మలు, లైక్‌లు, సబ్‌స్రై్కబ్‌ల కోసం రకరకాల అసత్య ప్రచారా­లు జరుగుతున్న తరుణంలో చిన్నారులకు తెలియ­కుం­డా జరిగే ఒక క్లిక్‌తో ప్రమాదాన్ని కొని తెచ్చుకోవమే. అన్నింటి కంటే ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఇన్‌స్ర్ట్రాగామ్, వాట్సాప్‌లను క్రియేట్‌ చేసుకుని పెద్దలకు తెలియకుండా చూసిన తర్వాత డెలీట్‌ చేసి ఏమి తెలియనట్లు యదావిధిగా ఫోన్‌ను అందిస్తున్నారు. సెల్‌ఫోన్‌ను తగ్గించే ప్రయత్నం చేయడంతోపాటు పుస­్తకాలు అలవాటు చేయడం, ఆటల ద్వారా 
వారిలో వినో­దం పంచడం లాంటి వాటిపై దృష్టి కేంద్రీకరించాలి.  

కేసులతో జీవితాలు ఛిద్రం 
అన్నమయ్య జిల్లాలో అవనసరంగా చెడు మార్గంలో పయనిస్తూ పోలీసు కేసులతో తమ జీవితాలను వారే చిధ్రం చేసుకుంటున్నారు. రెండేళ్ల కిందట మదనపల్లె, రాజంపేట పరిధిలో మైనర్లు పలు నేరాలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కున్నారు. నెలన్నర కిందట పీలేరులో గంజాయి మత్తులో ఇద్దరు విద్యార్థులు రైలు కిందపడి చనిపోయిన నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలోనే రాయచోటిలో మందలించిన టీచర్‌పై ముగ్గురు విద్యార్థులు చితకబాదడంతో ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటనను తలుచుకుంటేనే గగుర్పాటు కనిపిస్తోంది.

పెరిగిన వింత పోకడలు  
సమాజంలో చదువుకునే బాలల్లో వింత పోకడలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా సెల్‌ఫోన్లలో క్రైం స్టోరీలు చూడడం మొదలు ఇతర అనేక రకాల కారణాలతో విద్యార్థులు కూడా వేరే వ్యవహారాలకు బానిసలవుతున్నారు. ఒకరిని కొట్టినా, తిట్టినా శిక్ష కఠినంగా ఉంటుందన్న విషయం తెలియకనో, లేక ఏమౌతుందిలే అన్న ధీమాతో ఏదంటే అది చేస్తున్నారు. తల్లిదండ్రులు, గురువులకు తెలియకుండా రహస్య ప్రాంతాలను ఎంచుకుని సిగరెట్లు తాగడం, మత్తు పదార్థాలను అలవాటు చేసుకోవడం ఇలా చెడు మార్గాలవైపు పయనిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల విషయంగా ప్రత్యేక శ్రద్ద పెట్టకపోతే ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. దీనికితోడు చెడు సావాసంతో అనవసరంగా వెళ్లి వివాదాల్లో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)