Breaking News

తీరం దాటిన వాయుగుండం.. సముద్రం అల్లకల్లోలం

Published on Thu, 10/17/2024 - 07:08

AP Rains Updates..

👉బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం గురువారం తెల్లవారుజామున తీరం దాటింది. నెల్లూరు జిల్లాలోని తడా వద్ద వాయుగుండం తీరం దాటినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అల్పపీడనంగా వాయుగుండం బలహీనపడనుంది. 

కోనసీమ: 

  • ఓడలరేవు వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది.
  • సముద్రపు అలలు ఓఎన్‌జీసీ టెర్మినల్‌ గేటును తాకాయి.
  • ఓఎన్‌జీసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.

విశాఖ:

  • విశాఖలో ముందుకొచ్చిన సముద్రం
  • సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి.
  • విశాఖ, గంగవరం పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.
  • నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక

 

👉తిరుపతిలో భారీ వర్షాలు..

  • వర్షాల నేపథ్యంలో  అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు
  • భారీ వర్షాలతో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ వేంకటేశ్వ ర్
  • భారీ వర్షాలు కారణంగా ఈరోజు శ్రీవారి మెట్టు  మార్గం మూసివేసిన టీటీడీ
     

👉గడిచిన ఆరు గంటల్లో 22 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం తీరం దాటింది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

 

 

ఇక, ఇప్పటికే అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్‌ జిల్లాల్లోనూ రెండు రోజులుగా ఎడతెగని వర్షాలు పడుతున్నాయి. వర్షాల తీవ్రతకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుమల ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. నెల్లూరు నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై ఉండడంతో జన జీవనానికి ఇబ్బంది ఏర్పడింది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

 

వాయుగుండం కారణంగా తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)