Breaking News

ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 11న అల్పపీడనం!

Published on Wed, 06/09/2021 - 11:32

సాక్షి, అమరావతి: ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక నేడు(బుధవారం), రేపు( గురువారం) రాయలసీమలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం వాతావరణ శాఖ పేర్కొంది.

కరీంనగర్‌ జిల్లాలో భారీ వర్షం
కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. హుస్నాబాద్, అక్కన్నపేట, కొహెడ మండలాల్లో భారీ వాన పడిం‍ది. మేడ్చల్‌, సిరిసిల్ల, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం కురవడంతో పలు రోడ్లు, లోతట్టు పాంతాల్లో వాన నీరు నిలిచింది. ఇక రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రానున్న రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతటా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నట్లు తెలిపింది. ఈనెల 11న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే సూచించింది. 

ఈనెల 11 నుంచి 13 వరకు భారీ వర్షాలు నమోదవుతాయని, ఉత్తర, తూర్పు ప్రాంతంలోని జిల్లాల్లో అతిభారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించింది. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాగల 48 గంటల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించింది.
చదవండి: గ్రామీణ రోడ్లకు విరివిగా నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్‌ జగన్‌

Videos

అల్లు అర్జున్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?

నేను నిప్పు, తెరిచిన పుస్తకం అన్నావ్ గా.. మరీ ఈ సీక్రెట్ టూర్ లు ఏంటి?

ఫ్రెండ్స్ తో పందెం కట్టి.. పెన్ను మింగేశాడు

ఈ వయసులో నీకు బుద్ధి లేదా.. MLA బుచ్చయ్య చౌదరిపై రెచ్చిపోయిన చెల్లుబోయిన

స్విట్జర్లాండ్ లో పెను విషాదం.. 40 మంది మృతి ..100 మందికి గాయాలు

చంద్రబాబు మీద ఉన్న ప్రతి కేసు రీ ఓపెన్!

బుజ్జితల్లి టాలీవుడ్ కు వచ్చేస్తుందా..

ప్రేమపెళ్లి చేసుకున్న యువకుడిపై దాడి

800 KG కేక్ కట్టింగ్.. జగన్ ఆశీస్సులతో మనదే విజయం

జగన్ వార్నింగ్ తో చంద్రబాబు సెల్ఫ్ గోల్..

Photos

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

లంగా ఓణీలో 'ఈషా రెబ్బా'.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

హైటెక్ సిటీలో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)