Breaking News

‘కూటమి’ కనుసన్నల్లో.. పేట్రేగిపోతున్న ఇసుక మాఫియా

Published on Thu, 10/31/2024 - 15:59

సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు సర్కార్‌ అండదండలతో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. కూటమి నేతల కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మున్నేరు నుంచి లారీల్లో ఇసుక తరలిపోతోంది. జేసీబీలతో ఇసుకను తోడేస్తున్నారు. అనుమతులు లేని ప్రదేశంలో ఇసుక అక్రమ తవ్వకాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అక్రమ తవ్వకాలను పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు రైతులు అడ్డుకున్నారు. ఇసుక తవ్వకాలు జరిగితే మున్నేరులో కోత ఏర్పడి తమ పంట పొలాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనిగండ్లపాడు, శివాపురం గ్రామాల మంచినీటి స్కీం కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు అంటున్నారు.

మరోవైపు, నిషేధిత యనమలకుదురు ఇసుక క్వారీలో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. టీడీపీ నాయకుల అండదండలతో విజయవాడకు కూతవేటు దూరంలో ఇసుకమాఫియా పేట్రేగిపోతున్నా.. అధికారులెవ్వరూ అటువైపు కన్నెత్తిచూడటం లేదు. ఇసుక మాఫియా ఇక్కడ్నుంచి భారీగా ఇసుకను తరలిస్తూ సొమ్ముచేసుకుంటుండగా, టీడీపీ నేతలు అక్రమార్కులకు సహకరిస్తూ ఇసుకను కాజేస్తుండటం గమనార్హం.

పొంచి ఉన్న ప్రమాదం
కృష్ణానదిపై కనకదుర్గ వారధి నిర్మాణం పూర్తయిన తర్వాత దశాబ్దకాలం కిందట యనమలకుదురు క్వారీని ప్రభుత్వం నిషేధిత క్వారీగా ప్రకటించింది. అపట్నుంచి ఇక్కడ ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి.

అయితే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక యనమలకుదురు క్వారీలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ ఇసుక అక్రమ తవ్వకాలతో కనక దుర్గవారధితోపాటు యనమలకుదురు గ్రామానికి కూడా ప్రమాదం పొంచి ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)