Breaking News

సుధారాణి దంపతులపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగం

Published on Sun, 11/10/2024 - 04:33

సాక్షి, అమరావతి: సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ పెద్దిరెడ్డి సుధారాణి పట్ల మహిళ అని కూడా చూడకుండా పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారని, రోజులతరబడి ఆమెపైన, ఆమె భర్తపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా, మానసికంగా వేధించారని వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ ప్రతినిధులు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, పోలూరి వెంకటరెడ్డి, వినయ్‌ కుమార్‌ చెప్పారు.\

వారు శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఐదు రోజుల కిందట తెలంగాణలో గుడికి వెళ్లిన సుధారాణిని ఆమె భర్త, పిల్లలతో సహా పోలీసులు అదుపులోకి తీసుకొని చిలకలూరిపేటకు తీసుకొచ్చారని తెలిపారు. 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలి పెట్టాల్సింది పోయి వారి నిర్బంధంలోనే ఉంచుకొని, చిత్ర హింసలకు గురి చేశారని చెప్పారు. ఆమెపై 6 అక్రమ కేసులు బనాయించారన్నారు. ఏ సంబంధం లేని ఆమె భర్తపైన కూడా కేసులు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. తాము హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేయడంతో 8వ తేదీ సాయంత్రం గుంటూరు కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి, అక్కడి నుంచి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారని చెప్పారు.

మేజిస్ట్రేట్‌కు గాయాలు చూపించిన సుధారాణి
పోలీసులు శారీరకంగా వేధించి, గాయపర్చారని సుధారాణి మేజిస్ట్రేట్‌కు ఓపెన్‌ కోర్టులో చెప్పారని, ఆ గాయాలను కూడా చూపించారని ఆమె తరఫు న్యాయవాది వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి చెప్పారు. తనను, భర్త వెంకటరెడ్డిని, పిల్లలను చిలకలూరి­పేటకు తీసుకెళ్లారని, పిల్లలను వేరు చేసి భర్తతో పాటు తనను ఒంగోలు వన్‌టౌన్‌ పీఎస్‌కు తరలించినట్టు ఆమె మేజిస్ట్రేట్‌కు చెప్పారన్నారు. ఆమె వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్‌ నమోదు చేసినట్లు చెప్పారు. ఒంగోలు ఎస్పీ, ఒంగోలు సీఐ చేతులు, కాళ్లపై తీవ్రంగా కొట్టారని సుధారాణి చెప్పడంతో చికిత్స, మెడికల్‌ రికార్డుల కోసం ఆమెను గవర్నమెంట్‌ ఆస్పత్రికి తరలించారన్నారు.

శరీరంపై గాయాలు­న్నట్టు వైద్యులు సర్టిఫికెట్‌ ఇవ్వడంతో సుధారాణిని పోలీసులు హింసించినట్టు తేలిందని తెలిపారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే రాజకీయ ప్రలోభాలకు తలొగ్గి చట్టవ్యతిరేక చర్య­లకు పాల్పడి, సభ్య సమాజం సిగ్గు పడేలా వ్యవహ­రించడం దారుణమని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పోలీసులపై ఏ బుక్స్‌ రాసు­కోవాలో తమకు తెలుసని, వైఎస్సార్‌సీపీ కార్య­కర్తలను వేధించిన పోలీసులపై ప్రైవేటు కేసులు వేసి న్యాయస్థానాల్లో నిలబెడతామని హెచ్చరించారు.

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు