Breaking News

అక్రమ అబార్షన్‌కు ప్రయత్నం

Published on Sun, 11/01/2026 - 13:22

చిత్తూరు: తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలోని కీరసముద్రం సమీపంలోని పుదూరులో నివశిస్తున్న దంపతులకు ఇప్పటికే ఇద్దరు అడ పిల్లలున్నారు. ఆ మహిళ మరోసారి గర్భవతి కాగా కడుపులో ఉన్న శిశువు కూడా ఆడ పిల్ల అని ఆమెకు తెలియవచ్చింది. ఈ విషయం తెలుసుకొని కలత చెందిన కుటుంబ సభ్యులు మరో కుమార్తె పుడుతుందేమో అని భయంతో అబార్షన్‌ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం  ఆమె ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు పట్టణంలోని సంతపేటకు చెందిన గీత, ఇంద్రాని అనే ఇద్దరు మహిళలను సంప్రదించి వారిని తన ఇంటికి పిలిపించుకుంది. 

శనివారం ఉదయం గర్భవతికి అక్రమంగా గర్భస్రావం చేయడానికి యత్నించారు. ఈ విషయం సమీపంలోని బంధువులకు తెలియడంతో వీటిపై తిరుపత్తూరు జిల్లా ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. వెంటనే ఆరోగ్యశాఖ అధికారి శివకుమార్‌ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని తనిఖీ చేశారు. అప్పటికే వైద్యాధికారులు వాణియంబాడి పోలీసులకు కూడా సమాచారం అందజేయడంతో పోలీసులు అక్కడకు చేరుకొని విచారణ చేపట్టారు. 

ఆ సమయంలో చిత్తూరుకు చెందిన గీత, ఇంద్రాని కలిసి ఎటువంటి వైద్యం చదవకుండానే అక్రమ అబార్షన్‌ చేసేందుకు ప్రయతి్నంచినట్లు తెలియ వచ్చింది. దీంతో పోలీసులు గీత, ఇంద్రానిని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెల్లి విచారణ చేస్తున్నారు. మహిళ గర్భంలో ఉన్న శిశువు ఆడ పిల్ల అని చెప్పిన డాక్టర్‌ ఎవరు..? ఎటువంటి వైద్యం చదవకుండా ఇద్దరు మహిళలు అబార్షన్‌ చేసేందుకు యత్నించడంపై పోలీసులు సమగ్ర విచారణ చేస్తున్నారు. అదేవిధంగా చిత్తూరు నుంచి ఇద్దరు మహిళలను రప్పించి స్థానికంగా ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న మరో మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చ‌ద‌వండి: కొబ్బ‌రికాయ కొట్టి పోలింగ్ ప్రారంభించిన వీర మ‌హిళ‌!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)