Breaking News

గారపాడులో టీడీపీ గూండాల హైడ్రామా 

Published on Wed, 12/20/2023 - 05:09

గుంటూరు రూరల్‌: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడులో టీడీపీ గూండాలు హైడ్రామాకు తెరతీశారు. గతంలో జరిగిన వివాదాల నేపథ్యంలో వారిలోవారే పొలాల వద్ద గొడవ పడినట్లు నటించి తమపై వైఎస్సార్‌సీపీ నేతలు దాడిచేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల మాటలు విన్న పోలీసులు వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి తలుపులు పగలగొట్టి  మహిళలు, వృద్ధులు, యువకులను తీవ్రంగా కొట్టారు.

గ్రామంలో నాలుగు రోజుల కిందట టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడిచేశారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వినర్‌ కళ్లల్లో కారంకొట్టి మహిళలతో దాడి చేయించారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు ప్రణాళిక ప్రకారం మంగళవారం పొలాల వద్ద గొడవ జరుగుతున్నట్లు సృష్టించి పోలీసులకు ఫోన్‌ చేశారు. టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ పూనాటి రమేష్, నవతా సుబ్బారావు, వీరయ్య, పల్లపాటి నవీన్‌ తదితరులు పోలీసులకు డబ్బు ఎరజూపి తమపై దాడిచేయించారని బాధితులు విలపిస్తున్నారు.  

ఇంట్లోంచి బయటకు లాగి కొట్టారు  
పొలం పనికి వెళ్లి వచ్చి ఇంట్లో పడుకున్న వృద్ధులను పోలీసులు బయటకు లాక్కొచ్చి కొట్టారు. టీడీపీ నాయకులు దగ్గరుండి మరీ మమ్మల్ని కొట్టించారు. పోలీసులు కొడు­తుంటే, టీడీపీ వాళ్లు ఒక నెల ఆగండి మిమ్మల్ని ఏం చేస్తామో తెలియదంటూ బెదిరించారు. పో­లీ­సులు సైతం వారికే వత్తాసు పలుకుతున్నారు. మమ్మల్ని చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారు.   – మేరి, గారపాడు 

మిమ్మల్ని బతకనివ్వబోమని బెదిరిస్తున్నారు 
టీడీపీ వాళ్లు కావాలని మ­మ్మ­­ల్ని పోలీసులతో కొట్టించారు. మేము కూలీనాలీ చేసుకుని జీవిస్తుంటాం. వాళ్లే మాపై దాడులు చేసి కొడుతూ మాపై కేసులు పెడుతున్నారు. పైగా పోలీసులను పిలిపించి వారితో కూడా కొట్టిస్తున్నారు. అదే­మని పోలీసులను అడిగితే.. ఎందుకు అడుగుతున్నావని కూడా కొడుతున్నారు.  
– కె.కోటేశ్వరమ్మ, గారపాడు 

పొలంలో పనిచేసుకునే వారిని కొట్టారు 
పొలంలో పనిచేసుకుంటున్నవారిని పోలీసులు పిలిచి మ­రీ కొట్టారు. టీడీపీ నాయకు­లు పోలీసులను తీసుకొచ్చి కొట్టించారు. మేము ఏమీ చేయలేదుకదా.. ఎందుకు కొడుతున్నారంటే.. పోలీసులనే ప్రశి్నస్తావా అంటూ ఇంకా కొ­ట్టా­రు. మేము వైఎస్సార్‌సీపీకి సానుభూతిపరుల­మని టీడీపీ వాళ్లు మాపై దాడులు చేయి స్తున్నారు.   – కారసాల రమేష్, గారపాడు 

మహిళలను, వృద్ధులను కూడా పోలీసులు కొట్టారు 
టీడీపీ వాళ్లు కావాలని ప్రతి చిన్నవిషయానికి గొడవలు పెడుతూ దాడులు చేస్తున్నారు. మేము వారి గ్రామంలోనుంచి పొలాలకు వెళుతుండగా కొట్టారు. మళ్లీ పోలీసులకు చెప్పి వారితో కూడా కొట్టించారు. ఇంట్లో పడుకున్న వృద్ధులను, మహిళలను కూడా కొట్టారు. న్యాయం చేయండి.  – బేతపూడి వినయ్‌కుమార్, గారపాడు 

#

Tags : 1

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)