Breaking News

దారుణం.. అనుమానంతో భార్యను చంపిన భర్త

Published on Wed, 09/11/2024 - 12:45

సైదాపురం: క్షణికావేశంలో తాలికట్టిన భార్యపై అనుమానంతో కత్తితో దారుణంగా నరికి చంపేశాడు ఓ భర్త. అనంతరం బిడ్డలతో కలిసి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన ఘటన సైదాపురం మండలంలో చోటు చేసుకుంది. రాపూరు సీఐ విజయకృష్ణ అందించిన వివరాల మేరకు.. మండలంలోని గంగదేవిపల్లికి చెందిన చింతలపూడి మహేంద్ర(33)కు అదే గ్రామానికి చెందిన లావణ్యకు 11 ఏళ్ల కిందట పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి వరుణ్‌(10), జయవర్ధన్‌(8) ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల కిందట నెల్లూరుకు కాపురం మార్చారు. అయితే వీరి మధ్య ఏడాది నుంచి వివాదం జరుగుతుండేది. 

ఈ క్రమంలో ఇటీవలే స్వగ్రామానికి వెళ్లారు. మహేంద్రకు తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానం ఏర్పడింది.  ఈ నేపథ్యంలో సోమవారం భార్యభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. దుస్తులు సర్దుకుని తన అమ్మవారి పుట్టినిల్లు అయిన చిట్వేల్‌కు చేరుకునేందుకు లావణ్య సిద్ధమైంది. ఇరుగు పొరుగు వారు సర్దిచెప్పారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మళ్లీ ఇంటి నుంచి వెళ్లేందుకు లావణ్య ప్రయత్నించడంతో మహేంద్ర క్షణికావేశంలో అక్కడే ఉన్న కత్తి తీసుకుని తలపై కొట్టి గొంతు కోశాడు. 

దీంతో లావణ్య చనిపోవడంతో ఇద్దరు బిడ్డలను తీసుకుని మహేంద్ర సైదాపురం పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన భార్యను చంపేసినట్లు లొంగిపోయాడు. ఎస్‌ఐ క్రాంతికుమార్, సీఐ విజయకృష్ణ ఘటనా స్థలికి చేరుకుని హత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టారు. కేసును నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వారి రోదన చూసి స్థానికులు చలించిపోయారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)